Vijay Deverakonda Kushi: కోటి ఇచ్చేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ... ఎలా పొందాలో తెలుసా?
రౌడి హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆయన ఈ విజయంతో.. మరింత ఖుషి అయ్యి... 100 మంది కుటుంబాల్లో ఖుషి నింపేందుకు ఓ భారీ నిర్ణయం తీసుకున్నారు. ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున మొత్తం కోటి రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఇక ఆ లక్ష రూపాయలు ఎలా అప్లే చేసుకోవాలో ఈస్టోరీలో చూద్దాం.
విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజై... మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతుంది. ఇక ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విజయ్ దేవరకొండ.. తన ఖుషి సక్సెస్ సంతోషాన్ని వంద కుటుంబాల్లో నింపేందుకు... తన ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు వంద కుటుంబాలకు పంచుతానని చెప్పుకొచ్చారు. ఖుషి సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ... నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తానని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు విజయ్ దేవరకొండ. తన ట్విట్టర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ చేయగా.. అందులో నా విజయం సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను అంటూ రాసుకొచ్చారు. తన ఖుషి సంపాదనలో 1 కోటిని మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 లక్ష ఇవ్వబడుతుందని అన్నారు.

ఇక విజయ్ ట్వీట్ లో ఓ గూగుల్ ఫార్మ్ ఉంది. అందులో మీ పేరు, వివరాలు, ఫోన్ నెంబర్, అడ్రస్, మెయిల్ ఐడీతో పాటు... మీకు ఎందుకు లక్షరూపాయలు కావాలో కారణం అడిగారు. ఈ వివరాలన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొడితే వాళ్లకు చేరుతుంది. ఇక మీరు కనుక మీ పిల్లల విద్యకు ఇబ్బందులు పడితే.. ఇంకా ఏదైనా ఉంటే గనుక ఇప్పుడే అప్లై చేసుకోండి.
ఇక విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఖుషి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.


Click it and Unblock the Notifications











