Vijay Devarakonda: ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే ఎలా మరి.. ఆ ప్రశ్నకు విజయ్ షాకింగ్ ఆన్సర్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ ఈనెల 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాయి అని అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యులలో విజయ్ చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో విజయ్ కు ఊహించని ప్రశ్న ఎదురయింది. ఈ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నకు అతను కూల్ గానే కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్గెస్ట్ రిలీజ్

బిగ్గెస్ట్ రిలీజ్

రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మొదటిసారి పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇదివరకే విడుదలైన టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ కూడా అభిమానులలో అంచనాల స్థాయిని పెంచాయి. ఇక ముత్తానికి ఈ సినిమా ఈనెల 25వ తేదీన విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది.

సాలీడ్ అడ్వాన్స్ బుకింగ్స్..

సాలీడ్ అడ్వాన్స్ బుకింగ్స్..

లైగర్ సినిమా రిజల్ట్ పై విజయ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊహించని రేంజ్ లో వస్తున్నాయి. మొదటి రోజే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. దాదాపు హైదరాబాద్ లోని మెయిన్ సెంటర్స్ లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మిగతా ఏరియాలో కూడా రోజురోజుకు అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నాయి.

ఫ్లాప్ అయితే..

ఫ్లాప్ అయితే..

ఇక గ్యాప్ లేకుండా ప్రమోషన్ లో నిత్యం బిజీగా ఉంటున్న విజయ్ విలేకరులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తున్నాడు. అయితే రీసెంట్ గా అతనికి ఒక బాలీవుడ్ మీడియా నుంచి ఏదైనా ప్రశ్న ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ సినిమా.. ఎన్నో రోజులు కష్టపడి తీసిన లైగర్ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏమిటి అని ఒక బాలీవుడ్ విలేకరి ప్రశ్నించాడు.

కోపం లేదని అంటూ

కోపం లేదని అంటూ

గతంలో ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడుగితే నటీనటులు చాలా సీరియస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆ విధంగా రియాక్ట్ అవ్వకుండా చాలా కూల్ గా సమాధానం చెప్పడం హైలైట్ అయింది. మీరు ఇలాంటి ప్రశ్న అడిగినందుకు నాకు కోపం లేదు. కానీ ఇలా నన్ను కొన్నేళ్ల కొన్నేళ్ల క్రిందట అడిగి ఉంటే మాత్రం కోపంతో ఉండేవాడిని నిజంగా ఈ ప్రశ్నకు మీపై తీవ్రస్థాయిలో తిట్టేవాడినేమో అని అన్నాడు.

విజయ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్

విజయ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్

అంతేకాకుండా తనకు చాలా కోపం ఎక్కువ కానీ గత కొంతకాలంగా మాత్రం కోపం చాలా వరకు తగ్గిపోయింది అని ఎందుకంటే అభిమానుల ప్రేమ తనను చాలా మార్చేసింది అని విజయ్ దేవరకొండ చాలా కూల్ గా వివరణ ఇచ్చాడు. అలాగే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందులో ఎలాంటి డౌట్ లేదని కూడా నమ్మకంగా తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X