అందరికీ ఫ్రీ ఎంట్రీ.. లొకేషన్ చూసుకుని వచ్చేయండి: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
విడుదల సమయం దగ్గరపడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా నాలుగు భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 5 స్టేట్స్ పర్యటిస్తూ విభిన్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

ఎవరికీ సరిగా నిద్ర లేదు
ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ...ముందుగా నేను మా దర్శకుడు భరత్‌కు థాంక్స్ చెప్పాలి. సినిమా కోసం టీం మొత్తం చాలా కష్టపడింది. నాలుగైదు రోజుల నుంచి ఎవరికీ నిద్ర కూడా సరిగా లేదు. ట్రైలర్ బాగా కట్ చేయడం కోసం రాత్రింభవళ్లు శ్రమించారని చెప్పుకొచ్చారు.

నా తమ్ముడి సినిమా రేపు రిలీజ్... వాడికి అసలు టెన్షనే లేదు
ఈ రోజు ట్రైలర్ రిలీజ్ ఉండటంతో ఉదయం 6 గంటలకే లేచాను. మా తమ్ముడి సినిమా రేపు(జులై 12) రిలీజ్. వాడు 9 గంటలకు లేచాడు. మా సినిమా 26న... నాకేమో నిద్ర లేదు. ఫైనల్లీ ట్రైలర్ వచ్చేసింది. ఎమోషనల్‌గా ఫీలయ్యాను. సినిమా సంవత్సరం నుంచి మా చేతిలో ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చూపించబోతున్నాం.
బాడీలో అడ్రినల్ అనే హార్మోన్ ఎక్కువైంది
తెలుగు, తమిళ, కన్నడ, మళయాలంలో జులై 26న సినిమా రాబోతోంది. మీకు ఈ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సాధారణంగా నేను చిల్ ఉంటాను. నా సినిమా రిలీజ్ రోజు కూడా 12 గంటలకు నిద్ర లేచిన రోజులు ఉన్నాయి. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ వారం నుంచి నిద్ర పట్టడం లేదు. బాడీలో అడ్రినల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతూ మంచి కిక్ ఇస్తోంది.

అందరికీ ఫ్రీ ఎంట్రీ.. లొకేషన్ చూసుకుని వచ్చేయండి
సినిమా కోసం సంవత్సరం కష్టపడ్డాం. ఇపుడు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఐదు రాష్ట్రాల్లో తిరుగుతూ డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాలనుకుంటున్నాం. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మిలియన్ల కొద్దీ ప్రేక్షకుల సపోర్ట్ ఉండటం వల్లే సాధ్యమైంది. ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో అందరికీ ఉచిత ఎంట్రీ ఉంటుంది. మీరు లొకేషన్ చూసుకుని వచ్చేయండి. రేపు బెంగుళూరులో జరిగే మ్యూజిక్ షోకు యష్ భాయ్ కూడా వస్తున్నాడు. అందరూ అక్కడికి రావొచ్చు.... అని విజయ్ సూచించారు.


Click it and Unblock the Notifications











