Vijay Devarakonda: లైగర్ దెబ్బకొట్టినా రౌడీ హీరోకు ఆఫర్ల వెల్లువ.. లైనప్ లో మొత్తం 5 ప్రాజెక్టులు!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. మళ్ళీ అతను తదుపరి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే రాబోయే రోజుల్లో విజయ్ నుంచి క్రేజీ కాంబినేషన్స్ వెండి తెరపైకి రాబోతున్నాయి. ఇక అతను మొత్తంగా ఇప్పుడైతే ఐదు ప్రాజెక్టులకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

డిజాస్టర్ ఎఫెక్ట్
అసలైతే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే మళ్ళీ వెంటనే పూరి జగన్నాథ్ తో ఒక సినిమాను మొదలు పెట్టేవాడు. లైగర్ సినిమా విడుదలకు ముందే పూరి విజయ్ ఇద్దరు కూడా మరో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దానికి జనగణమన అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. పూరి డ్రీం ప్రాజెక్టుగా ఆ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ లైగర్ డిజాస్టర్ కావడంతో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.

ఖుషిపై కాన్ఫిడెన్స్
ఇక విజయ్ దేవరకొండ లైనప్ లో నెక్స్ట్ రాబోతున్న చిత్రం ఖుషి సినిమా. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శివ నిర్వణ తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అతను ఇంతకుముందు నిన్ను కోరి, మజిలీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. మధ్యలో టక్ జగదీష్ అనే సినిమా కూడా చేశాడు. ఇక ఖుషి సినిమా పై విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ర్యాంపేజ్ కాంబో
ఇక విజయ్ దేవరకొండ సుకుమార్ కలయికలో కూడా ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ పై ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా అది ర్యాంపేజ్ లాంటి సినిమా అవుతుంది అని వచ్చే ఏడాది పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత దర్శకుడు సుకుమార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మధ్యలో రాంచరణ్ కూడా సుకుమార్ తోనే చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైనా కావచ్చు. కానీ తప్పకుండా విజయ్ తో అయితే సుకుమార్ సినిమా చేస్తాడు.

జెర్సీ డైరెక్టర్ తో..
ఇక జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కాంబినేషన్ ను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కథ గురించి కొన్నిసార్లు చర్చలు జరిగాయి. ఇక ప్రస్తుతం గౌతమ్ ఫైనల్ నెరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే పూర్తి కథతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ మరో రెండు
ఇక విజయ్ దేవరకొండ రీసెంట్ గా మరొక రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే విజయ్ దేవరకొండ మరో సినిమా చేనున్నాడట. ఒక యువ దర్శకుడు చెప్పిన కథకు విజయ్ సెట్ అవుతాడు అని కరణ్ జోహార్ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అలాగే మరో బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో కూడా విజయ్ దేవరకొండ సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అయితే విజయ్ 5 ప్రాజెక్టులను ఇప్పుడు లైన్ లో పెట్టాడు. మరి భవిష్యత్తులో ఏ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











