ఫైటర్ ఆల్సో షూటర్ ఆల్సో... గురి చూసి కొట్టిన విజయ్!!
విజయ్ దేవరకొండ ఏది చేసినా ఓ సెన్సేషనే. ఓ మాట మాట్లాడినా, ఎక్కడైనా కనిపించినా విజయ్ విషయాలన్నీ వైరల్ అవుతుంటాయి. విజయ్ ప్రత్యేకంగా కాంట్రవర్సీ చేసి వైరల్ అవ్వాల్సిన పనే ఉండదు. విజయ్ దేవరకొండే అంటేనే ఓ వైబ్రేషన్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో విజయ్‌కి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ హీరోలందరిలోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన వారిలో ముందున్నాడు.
తాజాగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అందరికీ ఓటు హక్కు అవసరం లేదని విజయ్ చెప్పుకొచ్చాడు. లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వాడికి, బాగా డబ్బున్న వారికి ఓటు హక్కు అవసరం లేదని, మిడిల్ క్లాస్ వాళ్లకు, చదువుకున్న వాళ్లే కాస్త ఆలోచిస్తారు కాబట్టి వారికి మాత్రమే ఓటు హక్కు బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాతో దుమారం రేపాయి. కొంత మంది ఆ వ్యాఖ్యలను సమర్థించారు. ఇంకొందరు వ్యతిరేకించారు.


అదంతా కాసేపు పక్కన పెడదాం. విజయ్ ప్రస్తుతం యూరప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. పని చేసి చేసి పిచ్చెక్కిపోయినప్పుడు.. నటుడిని కావడం వల్ల ఉండే కొన్ని అసౌకర్యాల నుంచి తప్పించుకునేందుకు, మరీ ముఖ్యంగా అక్కడే దొరికే అద్భుతమైన ఫుడ్ కోసం అక్కడి వెళ్లాలని అనిపిస్తోంది యూరోప్ గురించి విజయ్ చెప్పుకొచ్చాడు. అయితే యూరప్‌లో విజయ్ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా టార్గెట్ గురి చూసి కొట్టి ఔరా అనిపించాడు. అసలే ఇప్పుడు ఫైటర్‌గా పూరి డైరెక్షన్‌లో దుమ్ములేపనున్న విజయ్ త్వరలోనే షూటర్‌గానూ రచ్చ చేస్తాడేమో మరి.


Click it and Unblock the Notifications











