Vijay Devarakonda: హాలీవుడ్ రేంజ్‌లో విజయ్ థమ్సప్ యాడ్.. మనోడి దెబ్బకు వాళ్ల ఫ్యూజ్‌లు ఔట్

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపును అందుకున్న అతడు.. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న విజయ్.. ఒక్క సినిమా చేయకున్నా బాలీవుడ్‌లో సైతం సెన్సేషన్ అయిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థ థమ్సప్‌కు బ్రాండ్ అంబాసీడర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వీడియో వచ్చింది. దీనిపై మీరూ లుక్కేయండి!

ఆరంభంలోనే హిట్లతో స్టార్‌గా

ఆరంభంలోనే హిట్లతో స్టార్‌గా

హీరోగా నటించిన మొదటి చిత్రం 'పెళ్లి చూపులు'తో విజయ్ దేవరకొండ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలవడంతో పాటు విజయ్‌ను స్టార్‌గా మార్చేసింది. అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సక్సెస్‌లనూ అందుకున్నాడు.

అప్పటి నుంచి వరుస షాక్‌లు

అప్పటి నుంచి వరుస షాక్‌లు

తొలినాళ్లలోనే భారీ సక్సెస్‌లను అందుకుని విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో హవాను చూపించాడు. కానీ, ఇటీవల అతడు 'నోటా', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి వరుస ఫ్లాపులను చవి చూశాడు. దీంతో అతడితో పాటు అభిమానులు కూడా నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తన క్రేజ్‌ను మాత్రం అంతకంతకూ పెంచుకుంటూనే వెళ్తున్నాడీ హీరో.

డైనమిక్ డైరెక్టర్‌తో కలిసి ఇలా

డైనమిక్ డైరెక్టర్‌తో కలిసి ఇలా

కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైపోయింది.

అలాంటి రోల్... దేశ వ్యాప్తంగా

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక, ఈ సినిమా పుణ్యమా అని విజయ్ పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగుతోంది. క్రమంగా అతడికి అక్కడ మంచి మార్కెట్ ఏర్పడుతోంది.

క్రేజ్ పెరిగి... రేంజ్ మారింది

క్రేజ్ పెరిగి... రేంజ్ మారింది

సినిమాల్లోకి వచ్చిన చాలా తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు 'లైగర్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా విడుదల కాకముందే అతడు అక్కడ హల్‌చల్ చేస్తూ వచ్చాడు. దీంతో అతడికి ఉత్తరాదిలోనూ భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా ఈ రౌడీ బాయ్ రేంజ్ కూడా ఊహించని రీతిలో పెరిగిపోయింది.

Recommended Video

Devarakonda Brothers About Pushpaka Vimanam Movie | Part 1
హాలీవుడ్ రేంజ్‌లో వీడియో

హాలీవుడ్ రేంజ్‌లో వీడియో

దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్రముఖ కూల్ డ్రింక్ థమ్సప్‌కు బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా దీనికోసం అతడు చేసిన ప్రకటన వీడియో విడుదలైంది. ఇందులో విజయ్ హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. మనోడి దెబ్బకు శత్రువుల ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X