బాలీవుడ్ బాటలో రౌడీ బాయ్
బాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని స్టైలింగ్, యాటిట్యూడ్ ఇలా మిగతా హీరోలకంటే భిన్నంగానే ఉంటుంది.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు ఆతర్వాత గీత గోవిందం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా... కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడిన సంగతి తెలసిందే. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నాడు పూరి. అయితే విజయ్ నటించినం గీతగోవిందం , ద్వారకా లాంటి సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. యూట్యూబ్ లో ఈ సినిమాలు మంచి వ్యూస్ ను దక్కించుకున్నాయి .

విజయ్ యాటిట్యూడ్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. కొందరు హీరోయిన్లు సైతం విజయ్ అంటే ఇష్టమని కూడా గతంలో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్ కపూర్ డైరెక్షన్ లో విజయ్ త్వరలో ఓ స్ట్రైట్ హిందీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.
బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ ఆధారంగా అభిషేక్ కపూర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం . 60 గంటలు పాకిస్తాన్ లో బందీ గా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాత్రను విజయ్ పోషించనున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ లతో కలిసి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడట అభిషేక్ కపూర్. మరి మన రౌడీ హీరో బాలీవుడ్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











