నిర్మాతగా విజయ్ దేవరకొండ... హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్లో క్రేజీ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ.... 'పెళ్లి చూపులు' సినిమా ద్వారానే లైమ్‌లైట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తరణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. తనకు ఇంత మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను త్వరలో నటుడిగా పరిచయం చేయబోతున్నాడు విజయ్.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో తరుణ్ భాస్కర్ నటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నారట. షామీర్ అనే కొత్త దర్శకుడు డైరెక్టర్ చేయబోతున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అభినవ్ గోమటి, ఉపేంద్ర కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తరుణ్ భాస్కర్ అలా నటన వైపు

తరుణ్ భాస్కర్ అలా నటన వైపు

వాస్తవానికి తరుణ్ భాస్కర్‌కు ఫిల్మ్ మేకింగ్‌పై ఆసక్తి ఎక్కువ. అయితే షామీర్ తన సినిమాలో పాత్రకు తరుణ్ భాస్కర్ పర్ఫెక్టుగా సరిపోతాడని, అతడిలో మంచి యాక్టర్ కూడా ఉన్నాడని భావించాడు. వెంటనే అతడికి చెప్పి ఒప్పించాడట.

నిర్మించడానికి ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ

నిర్మించడానికి ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ

ఈ సినిమా ఐడియా విజయ్ దేవరకొండకు చెప్పడంతో అతడికి ఎంతో నచ్చేసి తాను సినిమా నిర్మాణంలో భాగం అవ్వడానికి ముందుకు వచ్చాడట. యూత్‌ఫుల్ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ తరం యువతకు సంబంధించిన అంశాలతో ఉంటుందని తెలుస్తోంది.

ఎప్పుడు మొదలవ్వబోతోంది?

ఎప్పుడు మొదలవ్వబోతోంది?

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్లో ఈ చిత్రాన్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లేహ్ ప్రాంతంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ త్వరలోనే ‘డియర్ కామ్రేడ్' చిత్రంలో బిజీ అవ్వబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X