2.ఓ తరువాత నా సినిమానే.. విజయ్ దేవరకొండ ట్వీట్!
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్ సాంకృత్యాన్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 17న విడుదలకు సిద్ధం అవుతోంది. గీత గోవిందం, నోటా చిత్రాల తరువాత విజయ్ దేవరకొండ నుంచి ఈ ఏడాది వస్తున్న మూడో చిత్రం ఇది. ప్రియాంక జవాల్కర్ డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో టాక్సీవాలపై అంచనాలు పెరిగాయి. తాజాగా విజయ దేవరకొండ ఈ చిత్రం గురించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. విడుదలకు ముందునుంచే ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలియజేశాడు. టాక్సీవాలా యూట్యూబ్ ట్రెండింగ్ లో మొదటిస్థానంలో ఉంది. బుక్ మై షోలో 2.ఓ తరువాత టాక్సీవాలా కోసం ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఐఎండిబిలో ఈ చిత్రం మూడవ స్థానంలో ఉందంటూ విజయ్ ట్వీట్ చేశాడు.

టాక్సీవాలాపై ప్రేక్షలులు ఇంతగా అభిమానం చూపిస్తున్నారని విజయ్ తెలిపాడు. మీ ప్రేమ ఇలాంగే కొనసాగాలని విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు.


Click it and Unblock the Notifications











