బైక్ రేసర్‌గా విజయ్ దేవరకొండ!
అర్జున్ రెడ్డి సెన్సేషన్ విజాజ్ దేవరకొండ టాలీవుడ్ లో తిరుగులేని విధంగా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకునే పనిలో విజయ్ దేవకొండ ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కు విజయ్ అంగీకారం చెబుతున్నాడు.
ఇటీవల విజయ్ దేవరకొండ ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆనంద్ అన్నామలై దర్శత్వంలో త్రిభాషా చిత్రంలో విజయ్ నటించనున్నాడట. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా నటించబోతునట్లు తెలుస్తోంది.

కెరీర్ ఆరంభం నుంచి విజయ్ దేవరకొండ భిన్నమైన కథలకు ప్రాధ్యానత ఇస్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో విజయాలు సొంతం చేసుకున్నా విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సంబందించిన తొలి షెడ్యూల్ ఢిల్లీలో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











