వైట్‌సూట్‌లో స్టైలీష్‌గా విజయ్ దేవరకొండ, చురకత్తుల్లాంటి చూపులతో రౌడీ స్టార్!
హేమా హేమీలున్న టాలీవుడ్‌లోకి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు తెరపై స్టార్ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. చిన్న చితకా పాత్రలు , సెకండ్ హీరోగా నటిస్తూ వెళ్తున్న విజయ్ లైఫ్‌లో పెళ్లిచూపులు మూవీ టర్నింగ్ పాయింట్ .. ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి ఈ రౌడీ స్టార్‌లోని నటుడిని బయటకు తీసుకొచ్చింది. యాంగర్ మేనేజ్‌మెంట్ , ప్రేమ ఎలిమెంట్స్‌తో వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి నటించిన గీతా గోవిందం క్లాసికల్ మూవీగా భారీ వసూళ్లు సాధించింది.
వరుస విజయాలతో విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్‌తో పాటు ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్, మార్కెట్ ఏర్పడింది. అలాంటి విజయ్ స్పీడుకు లైగర్ బ్రేక్ వేసింది. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు రావడం అది కాస్తా ఇండస్ట్రీలో వివాదాస్పదం కావడం జరిగింది.

లైగర్ తర్వాత ఎట్టి పరిస్ధితుల్లోనూ హిట్ కొట్టాలని భావించిన విజయ్ తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీస్ చేసినా అక్కడా రిజల్ల్ తేడా కొట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ది ఫ్యామిలీమెన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో విజయ్ కెరీర్ డైలమాలో పడింది. స్టోరీల ఎంపికల విషయంలో విజయ్ జడ్జిమెంట్ పవర్ తగ్గిందని, ట్రెండ్‌ని పట్టుకోకుండా రోటీన్ సినిమాలు తీసి దెబ్బ తింటున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేశారు. ఇందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్‌ది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. 1854 నుంచి 1878 మధ్య జరిగే కథ అని చెబుతూ ఓ శిల్పాన్ని పోస్టర్‌లో చూపించారు. రాహుల్ సంకృత్యాన్‌తో ఆల్రెడీ టాక్సీవాలాలో నటించారు విజయ్ దేవరకొండ. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ మూవీస్‌తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు రాహుల్.
కాబట్టి ఆయనతో రిస్క్ తక్కువే అన్న ఉద్దేశంతో రౌడీ స్టార్ ఉన్నారు. ఈ మూవీలో విజయ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారని ఫిలింనగర్ టాక్. అలాగే గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులను, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా వైట్ కలర్ సూట్‌లో స్టైలీష్ లుక్‌లో ఉన్న ఫిక్స్‌ను విజయ్ షేర్ చేశారు. ఇది సినిమా కోసమా లేక ప్రైవేట్ ఫోటో షూటా అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











