Vijay Devarakonda: టార్జాన్ గా మారిన విజయ్ దేవరకొండ.. పొట్టపై కొండచిలువ, పులితో ఫైట్.. ఎవరు గెలిచారంటే?

చిన్న చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్ చేస్తూ రౌడీ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీతో పూర్తి హీరోగా మారిపోయాడు. ఇటీవల డ్యాషింగ్ అండే డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా హిట్ కోసం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ రౌడీ హీరో. ఇప్పటికే ఖుషి సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. మరో రెండు చిత్రాలు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా సినిమాలే కాకుండా ఫారెన్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్. ఈ క్రమంలో అడవి జంతువుల మధ్య టార్జాన్ అవతారం ఎత్తాడు రౌడీ హీరో.

 పాన్ ఇండియా చిత్రంగా..

పాన్ ఇండియా చిత్రంగా..

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్​ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో ఫుల్​ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే ద్వారక, టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు విజయ్ దేవరకొండకు ఫ్లాప్ చిత్రాలుగా మిగిలాయి. ఇక ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్​ మూవీతో తన కెరీర్​లో మొదటగా పాన్ ఇండియా చిత్రం చేశాడు.

డిఫరెంట్ ప్రాజెక్టులతో..

డిఫరెంట్ ప్రాజెక్టులతో..

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా చేసిన లైగర్ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ అందులో చాలా కష్టపడి వర్క్ చేశాడు కానీ సినిమా మాత్రం పూర్తి స్థాయిలో మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ రౌడి స్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు విజయ్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మాత్రం మరింత ఎక్కువ స్థాయిలో ఫోకస్ చేస్తున్నట్లుగా అర్థమవుతొంది. ఈ ఏడాది విజయ్ మరికొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టబోతున్నాడు.

పోలీస్ ఆఫీసర్ గా విజయ్..

పోలీస్ ఆఫీసర్ గా విజయ్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమాకు సంబంధించి ఇటీవల అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. జెర్సీ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయ్ దేవరకొండ 12వ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు పోస్టర్ కూడా విడుదల చేశారు.

 సుకుమార్ తో విజయ్ సినిమా..

సుకుమార్ తో విజయ్ సినిమా..

ఇప్పటికే సమంతతో చేస్తున్న ఖుషి మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలే కాకుండా.. విజయ్ మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో చేయబోతున్నట్లు సమాచారం. ఇక విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఆ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. హరీష్ శంకర్ తో కూడా విజయ్ గతంలో ఒక కథపై చర్చలు జరిపారు. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

పులులు, సింహాలతో రౌడీ హీరో..

పులులు, సింహాలతో రౌడీ హీరో..

ఇలా వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విజయ్ దేవరకొండ.. సరదాగా ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న విజయ్ యానిమల్ లవర్ గా.. టార్జాన్ గా మారిపోయాడు. దుబాయ్ లోని ఓ యానిమల్ పార్కులో అక్కడి జంతువులతో సరదాగా గడిపాడు విజయ్. పులులు, సింహాలు, పక్షులు, పాములతో ఫొటోలు, వీడియోలు తీసుకున్న విజయ్ దేవరకొండ ఆ జ్ఞాపకాలన్నింటిని ఒక వీడియోగా మలిచాడు. ఆ వీడియోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

విజయ్ మెడలో పాము.. కొండ చిలువ..

విజయ్ దేవరకొండ షేర్ చేసిన లేటెస్ట్ వీడియోలో.. ఒక పెద్దపులితో తాడు లాగుతూ ఫైట్ చేయడం హైలెట్ గా ఉంది. కేజ్ అవతల ఆ పులి నోటితో పట్టుకున్న తాడును విజయ్ కేజ్ ఇవతల నుంచి మరో ఇద్దరితో కలిసి లాగాడు. అయినా ఆ ఫైట్ లో పులి గెలిచింది. దీంతో తాను ఓడిపోయినట్లు బోర్డ్ చూపించాడు విజయ్. అలాగే మెడలో పాము వేసుకున్నాడు. భారీ కొండచిలువను పొట్టపై వేసుకున్నాడు విజయ్. ఒక చిన్న పులి పిల్లకు పాలు పట్టాడు.ఇలాంటి సరదా సన్నివేశాలు ఎన్నో ఆ వీడియోలో ఉన్నాయి. అలాగే వీడియోకు "జీవితంలో మరికొన్ని జ్ఞాపకాలు" అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X