twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలాంటి సమయంలో లేనందుకు బాధగా ఉంది.. దటీజ్ విజయ్

    |

    రౌడీ బాయ్, టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటాడో అందరకీ తెలిసిందే. విజయ్ తన సినిమాలతో ఎంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడో అంతకు పదింతల ఫాలోవర్లను తన యాటిట్యూడ్, బిహేవియర్‌తో సంపాదించుకున్నాడు. విజయ్ ఏది చేసినా ఓ ప్రత్యకత దాగి ఉంటుంది. సినిమాల్లో అయినా, ప్రైవేట్ ఈవెంట్లైనా, పబ్లిక్‌లో మాట్లాడినా విజయ్ తన ముద్రను చూపిస్తాడు.

    ప్రస్తుతం విజయ్ యూరప్‌లో స్వేచ్చగా విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య విజయ్ ప్రజాస్వామ్యం, ఓటు హక్కు గురించి మాట్లాడి నేషనల్ వైడ్‌గా వివాదాన్ని సృష్టించాడు. ఓటు హక్కు అందరికీ అవసరం లేదని, లిక్కర్ కోసం అమ్ముకునే వారికి, బాగా డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు తీసేస్తే మంచిదన్నట్టు మాట్లాడాడు. విజయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపించాయి.

     Vijay Devarakonda Worried about Hyderabad Floods

    తాజాగా విజయ్ హైద్రాబాద్ పరిస్థితిని తలుచుకుని బాధపడ్డాడు. ఎడతెగని వానలు కురవడం, వరదలు సిటీని ముంచెత్తడంపై విజయ్ ఆందోళన చెందాడు. ఇళాంటి సమయంలో అక్కడ నేను అందుబాటులో లేకపోవడం చాలా బాధగా ఉంది.. మీ అందరి కోసమే నేను ఆలోచిస్తున్నా.. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా.. తొందరగా అక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. అంటూ విజయ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

    English summary
    Vijay Devarakonda Worried about Hyderabad Floods, Hyderabad Sad to be away at this hour, but thinking about all of you and praying for everyone. Looking forward to returning home soon. Sending my Love and Strength, Vijay
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X