విజయ్ దేవరకొండ సంచలనం: ప్రభాస్‌తో పాటు స్టార్లందరినీ వెనక్కి నెట్టేశాడు!
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ టైమ్స్ సంస్థ విడుదల చేసిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 లిస్టులో సంచలన ర్యాంకుతో హాట్ టాపిక్ అయ్యాడు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్... తాజా ర్యాంకింగ్స్‌లో పెద్ద పెద్ద స్టార్లను సైతం వెనక్కి నెట్టేశాడు.
తాజాగా విడుదలైన లిస్టులో విజయ్‌కి 4వ స్థానం దక్కింది. ప్రభాస్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లతో పాటు విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ సైతం దేవరకొండ కంటే వెనకే ఉండటం గమనార్హం. ఆన్ లైన్ సర్వే నిర్వహించడం ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా టైమ్స్ సంస్థ ఈ జాబితా ప్రకటించింది.

విజయ్ దేవరకొండ న్యూ ఎంట్రీ
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 లిస్టులో విజయ్ దేవరకొండ న్యూ ఎంట్రీగా వచ్చి 4వ స్థానం దక్కించుకోవడం విశేషం. అతడికి ఇంత ఫేం రావడానికి ప్రధాన కారణం ‘అర్జున్ రెడ్డి' చిత్రం. ఈ చిత్రం హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతుండటంతో విజయ్ పేరు కూడా బాలీవుడ్ మీడియాలో మారు మ్రోగిపోయింది.

ప్రభాస్, విరాట్ కోహ్లి వెనకపడ్డారు
ఈసారి జాబితాలో ప్రభాస్, విరాట్ కోహ్లి వెనకబడ్డారు. అంతకుముందు ఏడాది 3వ స్థానంలో ఉన్న కోహ్లి...ఈ సారి 5వ స్థానానికి పడిపోయాడు. గతంలో 2వ స్థానంలో ఉన్న ప్రభాస్ ఈ సారి 12వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హృతిక్ రోషన్ 4వ స్థానం నుంచి 7వ స్థానానికి దిగజారాడు.

నెం.1 స్థానంలో విక్కీ కౌశల్
‘సర్జికల్ స్టైక్' మూవీ స్టార్ విక్కీ కౌశల్ ఈ సారి జాబితాలోకి న్యూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు నెం.1 స్థానం దక్కించుకున్నాడు. గతంలో నెం.1 స్థానంలో ఉన్న రణవీర్ సింగ్ 3వ స్థానానికి దిగిపోయాడు. ఫుట్‌బాలర్ ప్రథమేష్ మౌళింకర్ 2వ స్థానంలో ఉన్నారు.

టాప్ 20లో చోటు దక్కించుకున్న స్టార్స్
టాప్ 20లో వరుసగా విక్కీ కౌశల్, ప్రథమేష్ మౌళింకర్, రణవీర్ సింగ్, విజయ్ దేవరకొండ, విద్యుత్ జామ్ వాలా, హృతిక్ రోషన్, కార్తీక్ ఆర్యన్, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్, ప్రభాస్, వరుణ్ ధావన్, యష్, టైగర్ ష్రాఫ్, సాహిద్ కపూర్, జాన్ అబ్రహం, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రానా దగ్గుబాటి, దిల్జీత్ దోసాంజె ఉన్నారు.


Click it and Unblock the Notifications











