twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4 ఏళ్ల క్రితం రూ. 500 కూడా లేవు, అకౌంట్ లాక్ చేశారు: విజయ్ దేవరకొండ

    |

    2018లో ఇండియా వ్యాప్తంగా అత్యధికంగా సంపాదించిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో స్థానం సంపాదించుకున్న తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ... తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 లిస్టులో సైతం చోటు దక్కించుకున్నాడు.

    ప్రతిభను చాటుకుంటూ, పొటెన్షియాలిటీ ఏమిటో నిరూపించుకుంటూ.... నిర్దేశించుకున్న లక్ష్యాలవైపు విజయవంతంగా దూసుకెళుతున్న 30 ఏళ్ల లోపు యంగ్ అచీవర్స్ జాబితాను '30 అండర్ 30' పేరుతో ఫోర్బ్స్ సంస్థ సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం విజయ్ వయసు 29 సంవత్సరాలు.

    ఈ అచీవ్మెంటుపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    నాకు 25 సంవత్సరాలు, రూ. 500 కూడా లేవు

    నాకు 25 సంవత్సరాలు, రూ. 500 కూడా లేవు

    ఫోర్బ్స్ అచీవ్మెంటుపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ... ‘‘నాకు 25 సంవత్సరాల వయసు ఉన్నపుడు ఆంధ్రాబ్యాంకులో అకౌంట్ ఉండేది. రూ. 500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయడం లేదని అకౌంట్ లాక్ చేశారు. అపుడు డాడీ నాకు ఒకటే చెప్పారు.. 30 సంవత్సరాలు వచ్చేలోపు ఆ మ్యాటర్ సెటిల్ చేసుకోమన్నారు. 4 సంవత్సరాల తర్వాత చూసుకుంటే... ఫోర్బ్స్ 100 లిస్టులో స్థానం, ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు దక్కింది.'' అన్నారు.

    అప్పుడే సక్సెస్ ఎంజాయ్ చేస్తాం

    అప్పుడే సక్సెస్ ఎంజాయ్ చేస్తాం

    మనం యవ్వనంలో ఉన్నపుడు, తల్లిదండ్రులు హెల్దీగా ఉన్నపుడు మాత్రమే సక్సెస్ ఎంజాయ్ చేయగలం. నాన్న చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన చెప్పిన విధంగా ముందుకు సాగాను అని విజయ్ తెలిపారు.

    సంపాదనలో 72వ స్థానం

    సంపాదనలో 72వ స్థానం

    2018లో సంపాదన పరంగా టాప్ 100 సెలబ్రిటీల జాబితా ఇటీవల ఫోర్బ్స్ సంస్థ విడుదల చేయగా... విజయ్ దేవరకొండ రూ. 14 కోట్ల సంపాదనతో 72వ స్థానంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.

    విజయ్ పోస్టుపై కామెంట్స్

    విజయ్ పోస్టుపై కామెంట్స్

    విజయ్ చేసిన ఈ పోస్టుపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. 30 ఏళ్లలోపు సెటిల్ కావడం అందరికీ సాధ్యం కాదని, అలా జరుగాలంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు, అదృష్టం కూడా ఉండాలని కొందరు అభిప్రాయ పడ్డారు.

    English summary
    "I was 25. Andhra Bank lo 500 Rs. min balance maintain cheyakapothe lock chesinru account. Dad said settle before 30 - That way you can enjoy your success when you are young and parents are healthy. 4 years later - Forbes Celebrity 100, Forbes 30 under 30." Vijay Deverakonda tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X