వాడి కోసం పెళ్లి చేసుకోవాలా..? నాతో చేస్తే డబ్బులొస్తాయి: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురువారం(మే 9) తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి గురించి, తన యాటిట్యూడ్ గురించి మాట్లాడారు. తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశారు.
బర్త్ డేకు నాకేమీ గిఫ్టులు రాలేదు. నేనే అందరికీ ఐస్ క్రీములు గిఫ్టులుగా ఇస్తున్నాను. గతేడాది బర్త్ డే ట్రక్ ఐడియా వచ్చింది. ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తున్నాను. నాకు ఫాలోయింగ్ ఎందుకు పెరుగుతుందో తెలియదు. ఐస్ క్రీమ్స్ అయితే పెంచాలనుకుంటున్నాను. అవి ఎవరికైనా పంచినపుడు వచ్చే స్మైల్ నాకు బాగా నచ్చుతుందని విజయ్ దేవరకొండ తెలిపారు.

లవ్ మ్యారేజ్ ఇష్టమా? లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఇష్టమా?
లవ్ మ్యారేజ్ ఇష్టమా? లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఇష్టమా? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ... లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్ మ్యారేజ్ ఏదో ఒకటి బెటర్ అని సమాధానం ఇచ్చారు. ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కొంత మంది మైండ్ లో ఉన్నారు.. చూద్దాం.. ఇంట్లో ఈ విషయంలో మమ్మి డాడీ మధ్య డిస్క్రషన్ నడుస్తుంది. వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చాక నాకు చెబుతారు. ప్రస్తుతం మ్యారేజ్ గురించి ఆలోచించడం లేదని విజయ్ స్పష్టం చేశారు.

వాడి కోసం నేను పెళ్లి చేసుకోవాలా?
‘‘నిన్న రాత్రి మా మమ్మీ ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఎదుకు చేసుకోవాలంటే... పిల్లలు పుట్టాలి కదా అంటోంది. వాడి కోసం నేను పెళ్లి చేసుకోవాలా? అనిపించింది. వాడెవడో ఎప్పుడో వస్తాడు... హి ఆర్ షి.., వారి కోసం నేనెందుకు పెళ్లి చేసుకోవాలి. నా జీవితం నేను కోరుకున్నట్లు ఉండాలి'' అని విజయ్ వ్యాఖ్యానించారు.

అరేయ్ నువ్వు ఇట్లా చేయాలంటే అస్సలు చేయను
‘‘నేను ఒక హీరోలా, ఒక యాక్టర్‌గా ఏదో చేయాలి ఏదీ చేయను. నాకు అనిపించింది కాబట్టి చేస్తాను. ఎవరైనా అరేయ్ నువ్వు ఇట్లా చేయాలంటే అస్సలు చేయను, చేయాలనిపిస్తే చేస్తాను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. సంతృప్తిగా అనిపిస్తే చేస్తాను. నమ్మిన దానికి కట్టుబడి ఉంటారు. ప్రతి ఒక్కరూ వారు నమ్మిన విషయాలను ఫాలో అవ్వాలని కోరుకుంటాన' అని వెల్లడించారు. కొందరు నన్ను సోషల్ కాజ్ కోసం హెల్ప్ చేయమని అడుగుతారు. కానీ నేను వాటికి కనెక్ట్ కాలేను. నాకు నచ్చిన వాటికి, నేను నమ్మిన వాటికి కనెక్ట్ అవుతాను. నేను చిన్నప్పటి నుంచి అంతే... అని స్పష్టం చేశారు.

నాతో చేస్తే డబ్బులు వస్తాయి, ఫారిన్‌తో డేటింగ్ గురించి
విజయ్‌తో ఒక డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ సినిమా చేస్తే గ్యారంటీ సక్సెస్ ఉంటుంది, డబ్బులు వచ్చేస్తాయనే విషయాన్ని అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు ‘అంగీకరిస్తాను' అని స్పష్టం చేశారు. ‘‘విజయ్ ఫారినర్ తో డేటింగ్ చేస్తున్నాడు'' అనే ప్రశ్నకు.... చేస్తూ ఉండొచ్చేమో? అని సమాధానం ఇచ్చారు.

నేను చాలా ఆరొగెంట్
‘‘విజయ్ పొగరుబోతు కాదు, కానీ పైకి అలా చూపిస్తాడు'' అనే విషయంపై స్పందిస్తూ... నాకు చాలా పొగరు, నాకు మంచి మనసు ఉంది కానీ కొంత మంది నచ్చుతారు, కొంత మంది నచ్చరు, కొన్ని సార్లు హ్యాపీగా ఉంటా, కొన్ని సార్లు కోపంగా ఉంటా, ఒక మామూలు మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటానని తెలిపారు.

స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా నార్మల్ లైఫ్
‘‘స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా విజయ్ ఒక నార్మల్ లైఫ్ ఇష్టపడుతున్నాడు'' అనే పాయింటుకు ‘అగ్రీ' అని సమాధానం ఇచ్చారు. యాక్టింగ్ లేనపుడు ... నాకు ఇష్టమైన టీవీ సీరిస్, సినిమాలు చూస్తాను, బుక్స్ చదివుతాను. బాగా నిద్రపోతాను. జిమ్ వెళతాను.'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











