Vijay Deverakonda Marriage: త్వరలో విజయ్ దేవరకొండ పెళ్లి.. స్వయంగా చెప్పిన రౌడీ హీరో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం తాజాగా ఆయన చేసిన కామెంట్స్. విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ (Kushi Trailer)ను ఇవాళ (ఆగస్ట్ 9)న విడుదల చేశారు. అందుకు ఖుషి ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు.
ట్రైలర్ తో కథ: సామ్, విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. దీనిలోని పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆగస్టు 9న ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో ఖుషి సినిమా మొత్తం కథను చెప్పేశారు.

పాన్ ఇండియాగా: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఖుషి సినిమాలో విజయ్, సామ్ తోపాటు జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న పాన్ ఇండియాగా విడుదల చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ వేడుకలో విజయ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

ప్రేమకు భాష లేదు: "ఖుషిని ఎందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు" అని అడిగిన ప్రశ్నకు.. "సాధారణంగా మనం భారీ మాస్, కమర్షియల్ చిత్రాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాం. కానీ, ఖుషిని రెవెన్యూ కోసం అలా రిలిజ్ చేయడం లేదు. అన్ని భాషల ప్రేక్షకుల దగ్గరకు చేరువ కావడం కోసమే చేస్తున్నాం. ఖుషి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రేమకు భాష లేదు" అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

ఆ ఘడియలు దగ్గర్లో: "పెళ్లి అంటే మీ మనసులో ముందు ఏం గుర్తుకు వస్తుంది" అన్నదానికి.. "త్వరలో నేను కూడా (వివాహం) చేసుకోవాలి. ఆ ఘడియలు దగ్గరలో ఉన్నాయని అనిపిస్తుంది" అని విజయ్ దేవరకొండ అసలు విషయం చెప్పాడు. అంటే విజయ్ దేవరకొండ మాటలను బట్టి ఆయన త్వరలో వివాహంబంధంతో ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలస్తోంది.

ఎంజాయ్ చేస్తున్నాను: "మీరు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారా" అని అడిగితే.. "ఇంతకుముందు ఎవరైనా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే ఇరిటేషన్ వచ్చేది. పెళ్లి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. నా స్నేహితులకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. వాళ్లను చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వైవాహిక బంధంలో హ్యాపీగా ఉన్నవాళ్లు, ఇబ్బందులు పడుతున్నవాళ్లు ఉన్నారు. ప్రతిదీ ఎంటర్టైనింగ్ ఉంది" అని విజయ్ చెప్పుకొచ్చాడు.

అర్థం చేసుకోవాలి: విజయ్ దేవరకొండ ఇంకా కొనసాగిస్తూ "వైవాహిక బంధంలో భయపెట్టే అంశాల జోలికి వెళితే పెళ్లి చేసుకోలేం. వివాహంలో అందమైన మూమెంట్స్ చూసి ఏడు అడుగులు వేయాలి. పెళ్లి చేసుకోవడానికి ముందు జీవిత భాగస్వామి నచ్చాలి. ప్రేమించాలి. జీవితంలో ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి" అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











