Vijay Devarakonda: డేటింగ్‌ రూమర్స్‌పై ఓపెన్ అయిన రౌడీ హీరో.. ఇంతకీ ఏమన్నారంటే?

Vijay Deverakonda: ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ తోనే కాదు.. రూమర్స్ తో కూడా సెలబ్రెటీలు వార్తల్లో నిలుస్తారు. ఏ హీరో అయినా.. ఏ హీరోయిన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ బాగుంది. పబ్లిక్ గా ఒక్కసారి కనిపిస్తే చాలు.. లేని లేని రూమర్స్ క్రియేట్ అవుతాయి. వారిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్.. అంటూ లేనిపోని పుకార్లు క్రియేట్ అవుతాయి. అలా రూమర్స్ తో నిలిచిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డేటింగ్ విషయాలను పంచుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమన్నారంటే?

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డామ్ సొంతం చేసుకున్నాడు. తక్కువ సమయంలో ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. తాను నటించిన తొలి సినిమాలు హిట్ కొట్టిన.. ప్రస్తుతం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల తాను నటించిన ఏ సినిమా అయినా డిజాస్టర్ గా మిగులుతుంది. ఈ రౌడీ హీరో ఎంత సక్సెస్ చూశాడో.. అంతకంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూస్తున్నాడు. కానీ, వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తారు.

Vijay Deverakonda Addresses Dating Rumours With Rashmika Mandanna relation ship and love life

గత కొంత కాలంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై రష్మిక మందన కూడా ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వడం, అలాగే.. వీరిద్దరూ మీడియా కంటబడటం, ఇద్దరూ కలిసి టూర్స్ కు వెళ్లడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే డేటింగ్ వార్తలపై విజయ్ దేవర కొండ షాకింగ్ కామెంట్స్ చేసింది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రష్మిక మందన డేటింగ్‌ రూమర్స్‌ గురించి మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకు చెబుతానని అన్నారు. ఈ విషయం గురించి తాను చెప్పాలనుకున్నప్పుడూ తానే సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతాననీ, ఆ విషయాన్ని తెలుసుకోవాలని ఎంతో మంది ఎదురుచూస్తున్నారనీ, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని చెప్పుతానని అన్నారు.

అయితే.. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలనీ, కాబట్టి, అలాంటి రోజున సంతోషంగా తన వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా. పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారని విజయ్ దేవరకొండ అన్నారు. తొలుత తన ప్రొఫెషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నాననీ, ఇప్పడే దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోనని తెలిపారు. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తాననీ, ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందిస్తానని తెలిపారు విజయ్‌ దేవరకొండ తెలిపారు. అనంతరం విజయ్ దేవరకొండ ప్రేమ గురించి మాట్లాడుతూ.. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో తనకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే.. దానితోపాటే బాధ కూడా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ దేవర కొండ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Vijay Deverakonda Addresses Dating Rumours With Rashmika Mandanna relation ship and love life

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ వర్క్ ఫ్రంట్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. తాత్కాలికంగా VD12 అని పిలుస్తారు. ఇందులో విజయ్ గూఢచారి పాత్రను పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X