ముసుగేసుకొని మీడియాకు చిక్కిన విజయ్ దేవరకొండ.. పక్కనే రష్మిక రియాక్షన్ ఏమిటంటే!

టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ముంబైని అడ్డాగా చేసుకొని తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. పూరీ జగన్నాథ్ లైగర్ చిత్రం కోసం విజయ్ దేవరకొండ, బాలీవుడ్ చిత్రాల షూటింగుతో ముంబైలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా రష్మిక, విజయ్ ముంబైలోని ఓ జిమ్‌ నుంచి వస్తూ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కారు. ఆ వివరాల్లోకి వెళితే..

ముఖానికి మాస్క్, క్యాప్ వేసుకొని

ముఖానికి మాస్క్, క్యాప్ వేసుకొని

ప్రస్తుతం ముంబైలో భయానక వాతావరణం నెలకొన్నది. కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో సెలబ్రిటీలే కాకుండా సాధారణ ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. లైగర్ షూటింగులో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ముఖానికి మాస్కే కాకుండా తలను ఫుల్లుగా కవర్ చేసే విధంగా టోపి పెట్టుకోవడం అందర్ని నవ్వుల్లో ముంచేసింది.

విజయ్ దేవరకొండను చూసి నవ్వు ఆపుకోలేక

విజయ్ దేవరకొండను చూసి నవ్వు ఆపుకోలేక

విజయ్ దేవరకొండ పక్కనే ఉన్న రష్మిక మందన్న తన సహచర నటుడిని వేషాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. మీడియాను కూడా పట్టించుకోకుండా పొట్టచెక్కలయ్యేలా నవ్వుల్లో మునిగిపోయింది. మీడియా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకొంటున్న సమయంలో కూడా పట్టించుకోకుండా విజయ్‌ను చూసి ఆటపట్టించింది.

విజయ్ దేవరకొండ, రష్మిక డిన్నర్ డేట్

విజయ్ దేవరకొండ, రష్మిక డిన్నర్ డేట్

ఇదిలా ఉండగా, ముంబైలో తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అప్పుడుప్పుడు రెస్టారెంట్లలో కలుసుకొంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో పలు హోటళ్ల డిన్నర్‌కు వెళ్తూ మీడియా కంటపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనే రూమర్ వినిపిస్తున్నది.

లైగర్, బాలీవుడ్ చిత్రాలతో ...

లైగర్, బాలీవుడ్ చిత్రాలతో ...

విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే.. పూరి జగన్నాథ్, కరణ్ జోహర్ నిర్మిస్తున్న లైగర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ముంబైలోని ఓ స్టూడియోలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ కెరీర్‌పై దృష్టిపెట్టింది. గుడ్‌బై, మిషన్ మజ్ను చిత్రాల షూటింగులో పాల్గొంటున్నారు. అలాగే అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X