నాపై, నా సినిమాపై ఎటాక్.. 100 ఫ్యామిలీలకు 1 కోటి రూపాయలు ఇస్తా.. ఖుషి పంచుతా.. విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన

విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా మూడు రోజుల్లో 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. .

ఖుషి, నాపై ఎటాక్స్ అంటూ: ఖుషీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికి, తెలుగు ప్రజలందరికీ తలవంచి నమస్కారం చేస్తున్నాను. నా బ్రెయిన్‌లో రెండు,మూడు విషయాలు నడుస్తున్నాయి. ఒకటి మీ ప్రేమ. మీరు ఇస్తున్న ప్రేమ ఎంత గట్టిగా తాకుతుందో చెప్పలేను. నేను ఇంట్లో ఉన్న మీ ప్రేమ గట్టిగా తాకుతున్నది.

Vijay Deverakonda announced to donate 1 crore rupees

ఇక రెండోది నా మీద నా సినిమా మీద ఎటాక్స్ జరుగుతున్నాయి. ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలతో ఎటాక్ చేస్తున్నారు. వేల కొద్ది అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ రివ్యూలు ఇస్తున్నారు. కొంత మంది డబ్బులు పెట్టి నాకు, నా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మీ అరుపులు వింటుంటే.. ఆ విషయం మాట్లాడ బుద్ది కావడం లేదు అని విజయ్ దేవరకొండ అన్నారు.

Vijay Deverakonda announced to donate 1 crore rupees

ఖుషి క్యూట్ లవ్ స్టోరి అంటూ: మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఖుషీనా? మీరు ఖుషీ అయితే నేను ఫుల్ ఖుషీ. నేను హైదరాబాద్‌లో సినిమా చూస్తుంటే మీరు చూపిస్తున్న ప్రేమ తట్టుకోలేకపోయాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు.. చిన్న క్యూట్ లవ్ స్టోరి. కొన్ని ఎమోషన్స్‌తో కథ చెబుతామని శివ అన్నాడు. కానీ సినిమా రిలీజ్ తర్వాత మీరు చూపిస్తున్న ప్రేమ అద్బుతంగా ఉంది. మీ ప్రేమకు బదులుగా ఏదో ఇవ్వాలి. లైఫ్‌లో ఏదో చేయాలనిపించినప్పటి నుంచి డబ్బు సంపాదించాలనుకొన్నాను. మా అమ్మ,నాన్న హ్యాపీగా ఉండాలి. నాకు మంచి రెస్పెక్ట్ ఉండాలని పనిచేశాను. అదే నాకు డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉండేది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

Vijay Deverakonda announced to donate 1 crore rupees

నేను గెలిస్తే మీకు సంతోషం: అయితే నేను గెలిస్తే మీరు సంతోషపడుతుంటే.. విజయ్ మంచి సినిమా చేస్తే చూడాలని మీరు ఎదురు చూస్తున్నారనే విషయం తెలిసింది. నేను ఫీలైతే మీరు ఫీల్ అయి.. నేను సక్సెస్ అయితే మీరు నవ్వుతుంటే.. మీ గురించి పనిచేయాలని ఈ రోజు నుంచి నిర్ణయించుకొన్నాను. నా ఖుషి మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. మీ నవ్వులు చూస్తుంటే ఇంకా తృప్తి కలగడం లేదు. మీ అందరిని కలువడం సాధ్యం కాదు. నేను ఖుషిగా ఉన్నా.. మీరు ఖుషిగా ఉన్నారు. మీ కోసం ఏదో ఒకటి చేయాలని అనుకొంటున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

Vijay Deverakonda announced to donate 1 crore rupees

మీ కోసం నేను పనిచేస్తా అంటూ: నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు, నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. మీతో ఖుషి పంచుకోవడానికి నా సంపాదన నుంచి ఒక కోటి రూపాయలు మీ కోసం ఇవ్వాలని అనుకొంటున్నాను. ఒక 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి.. ప్రతీ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు అందిస్తా అని విజయ్ దేవరకొండ అన్నాడు.

Vijay Deverakonda announced to donate 1 crore rupees

100 మంది ఫ్యామిలీలకు 1 లక్ష రూపాయలు: నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే నా తృప్తి ఉండదు. రేపటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఫామ్ పెడుతా. స్పెండింగ్ ఖుషి.. దేవర ఫ్యామిలీ అని చెప్పి.. మీ ఇంట్లో రెంట్లు, పిల్లల చదువుకు ఉపయోగపడితే చాలు అని విజయ్ దేవరకొండ తెలిపారు. త్వరలోనే ఖుషి సినిమా సక్సెస్ మీట్‌ను పెద్దగా నిర్వహిస్తాం.

ఆ ఈవెంట్‌లో 100 మంది ఫ్యామిలీలను కలుస్తాను. ఆ ఈవెంట్‌లో వారిని కలిసి చెక్‌లు అందజేస్తాను. వైజాగ్, హైదరాబాద్, తెలుగు ప్రజలందరికీ ఒకటే చెబుతా. మీరు కనపడితే నాకు ఖుషి. నాకు ఖుషి మీ అరుపులు వినపడితే.. నాకు ఖుషి మీ నవ్వులు చూస్తే.. ఖుషీ నా ఒళ్లింత తుల్లింతే అని విజయ్ దేవరకొండ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X