For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vijay Deverakonda Birthday: టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా విజయ్ రికార్డు.. మీకు తెలియని విషయాలివే!

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోగా ఎదిగిపోయాడు రౌడీ గాయ్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. సినిమాల పరంగానే కాదు.. చాలా విషయాల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 'లైగర్'తో పాన్ ఇండియా స్టార్ అవుతున్నాడు. ఇక, ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు మీకోసం!

  హిట్‌తోనే కెరీర్‌ను మొదలు పెట్టిన విజయ్

  హిట్‌తోనే కెరీర్‌ను మొదలు పెట్టిన విజయ్

  ‘పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడతను. అలాగే, ‘మహానటి'లోనూ ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలో కనిపించి మెప్పించాడు.

  వరుస ఫ్లాపులతో రౌడీ గాయ్ ఇబ్బందులు

  వరుస ఫ్లాపులతో రౌడీ గాయ్ ఇబ్బందులు


  విజయ్ దేవరకొండకు ఎన్ని హిట్లు వచ్చాయో.. అదే స్థాయిలో ఫ్లాపులు కూడా పలకరించాయి. కెరీర్ ఆరంభంలోనే ‘ద్వారక' అనే సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అంచనాలతో వచ్చిన ‘నోటా' ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తుంది.

  బాలీవుడ్‌ పాగా వేసేందుకు రెడీ అయ్యాడు

  బాలీవుడ్‌ పాగా వేసేందుకు రెడీ అయ్యాడు

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ‘లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది.

  మరో రెండు రంగాల్లోనూ సత్తా చాటుతూనే

  మరో రెండు రంగాల్లోనూ సత్తా చాటుతూనే

  సినిమా హీరోగా తన సత్తాను నిరూపించిన విజయ్ దేవరకొండ.. బిజినెస్ రంగంలోనూ సక్సెస్ అయ్యాడు. అతడి క్లాత్ బ్రాండ్ ‘రౌడీ'కి బయట ఎంతో ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ‘మీకు మాత్రమే చెబుతా'తో నిర్మాతగానూ మారాడు. ఇందుకోసం కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే బ్యానర్‌ను సైతం స్థాపించాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో ‘పుష్పక విమానం' మూవీ తీస్తున్నాడు.

  ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే హీరో

  ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే హీరో

  విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా ఎంత సక్సెస్‌ఫుల్‌గా మంచి పేరును సంపాదించుకున్నాడో.. వ్యవహార శైలితోనూ అంతే ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో అతడు తన ఔదార్యాన్ని నిరూపించుకుంటూ విరాళాలు అందించాడు. అలాగే, ఓ ట్రస్టును కూడా ప్రారంభించాడు. దీని ద్వారా ఆపదలో ఉన్న వారికి, ఆకలితో ఉన్న వారికి సహాయం అందిస్తున్నాడు.

  విజయ్ కెరీర్‌లో గొప్ప మైలురాళ్ల గురించి

  విజయ్ కెరీర్‌లో గొప్ప మైలురాళ్ల గురించి

  విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఎన్నో మైలరాళ్లను అందుకున్నాడు. మరీ ముఖ్యంగా అతడు ఫోర్బ్స్ 2018 జాబితాలో ఇండియాలోనే 72వ స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాడు. అలాగే, ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. అలాగే, మరే హీరోకూ సాధ్యం కానీ రీతిలో ఏక కాలంలో నాలుగైదు బ్రాండ్లకు అంబాసీడర్‌గా ఉంటున్నాడు. అన్నింటికంటే లేడీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

  టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా విజయ్ రికార్డు

  టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా విజయ్ రికార్డు

  విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అతడికి ఫాలోవర్లు భారీగా పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 11 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. టాలీవుడ్‌లో మరే హీరోకూ ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదు. అలాగే, ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా మిగిలిన వాటిలో కలిపి 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

  English summary
  Deverakonda Vijay Sai is an Indian actor and producer who predominantly works in Telugu language films. He debuted in 2011 in Ravi Babu's romantic comedy Nuvvila, and gained recognition for his supporting role in Yevade Subramanyam (2015).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X