బ్రేకప్ గుట్టు విప్పిన విజయ్ దేవరకొండ.. పుష్పక విమానం ప్రమోషన్స్‌లో బాంబ్ పేల్చిన రౌడీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'లైగర్' సినిమాలో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా మారి చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. అంతకు ముందు తనను హీరోగా మార్చిన తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేసిన ఆయన ఇప్పుడు తమ్ముడు ఆనంద్ హీరోగా మరో సినిమా చేశాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీలక వివరాలు వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే

నవంబర్ 12న
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం'. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఉండగా దేబరకొండ బ్రదర్స్ తండ్రి గోవర్ధనరావు మరికొందరితో కలిసి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వ్యక్తిగత విషయాలు గురించి కూడా
ఎలా అయినా ఈ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్న విజయ్ దేవరకొండ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆనంద్‌తో పాటు విజయ్ దేవరకొండ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా ఓపెన్ అయ్యారు విజయ్ దేవరకొండ. ముందు నుంచి ప్రమోషన్స్ ని కూడా వెరైటీగా స్టార్ చేసే విజయ్ దేవరకొండ, తమ్ముడి ఆనంద్ దేవరకొండలో కలిసి ఎక్కువగా గూగుల్ అయిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు.

గూగుల్ లో ఎక్కువగా
వీరిద్దరి గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రశ్నలకు అన్నదమ్ములు సమాధానాలు చెప్పారు.. ఈ క్రమంలోనే ఇటీవలే తన హార్ట్ బ్రేక్ అయిందని, ప్రస్తుతం తాను బ్రేకప్ బాధలోనే ఉన్నానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. అంతే కాక ఇప్పటి వరకూ ఆ విషయం ఎవ్వరికీ తెలియదంటూ ఓపెన్ అయ్యారు రౌడీ స్టార్.

వెటకారంగా చెప్పారా
విజయ్ దేవరకొండ సింగిలా..? అన్న ప్రశ్నకు విజయ్ ఈ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇటీవలే నాకు బ్రేకప్ అయింది.. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.. కొంచెం బాధలో ఉన్నా అని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులందరూ షాక్ కి గురవగా అసలు విజయ్ నిజంగా చెప్పాడా..? లేక సరదాగా అన్నాడా అనే దాని మీద క్లారిటీ లేదు. అయితే ఆయన వెటకారంగా చెప్పారని కొందరు భావిస్తున్నారు.

ఆ అమ్మాయి ఎవరు..?
మరి కొందరు మాత్రం ఆ అమ్మాయి ఎవరు..? అని ఆలోచిస్తున్నారు. మరి రౌడీ హీరోతో బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే రౌడీ హీరోనే నోరు విప్పాలి. మరో పక్క ఈ 'పుష్పక విమానం' అనేది రీమేక్ సినిమా కాదు, ఒరిజినల్ కథనే అని కూడా స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలయ్యాక ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యే అవకాశం ఉందని వారి పేర్కొన్నారు.
Recommended Video

కామెడీ పార్ట్ ఎక్కువ
ఇక ఈ సినిమా జానర్ ఏది అని ప్రశ్నిస్తే లవ్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్నిరకాల యాంగిల్స్ ఈ కథలో చూపించబోతున్నట్లు విజయ్ తెలిపారు. ఇందులో ఎక్కువగా కామెడీ పార్ట్ ఉంటుందని, అబ్బురపరిచే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కథ విన్నాక తాము చాలా నవ్వుకున్నామని చెప్పిన విజయ్, ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా తనకు చాలా బాగా నచ్చిందని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











