సాహో, సైరాల చెంత తన సినిమానూ చేర్చుకున్న విజయ్ దేవరకొండ.. రౌడీ స్టార్ టెక్నిక్!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆనతికాలం లోనే క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరు ఆడియన్స్ ఆదరణ చూరగొన్నాడు విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకు తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్న ఆయన.. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా విషయమై తాజాగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
హాలీవుడ్ సినిమా టర్మినేటర్ సిరీస్ నుంచి టర్మినేటర్ డార్క్ ఫేట్ సినిమా విడుదల కాబోతోంది. నవంబర్ 1 వ తేదీన ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితం విజయ్ దేవరకొండ లాంచ్ చేయడం జరిగింది.

అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ప్రత్యేకాదరణ ఉంటుందని అన్నాడు. ప్రభాస్ అన్న టర్మినేటర్ లాంటి సినిమా చేయాలని అన్నాడు. హాలీవుడ్ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న డిస్నీ సంస్థ సాహో, సైరా, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలని అన్నాడు. దీంతో విజయ్ దేవరకొండ తాజా మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ సాహో, సైరా లాగే భారీ రేంజ్ ఉంటుందని అర్థం చేసుకుంటున్నారు విజయ్ మాటలు విన్న ఆడియన్స్.
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోంది. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశిఖన్నా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా కూడా మరో ముగ్గురు హీరోయిన్లుగా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











