కనీసం 2 ఏళ్లు రష్మికతో విజయ్ దేవరకొండ పనిచేయడట, కారణం ఏమిటంటే...

Recommended Video

Vijay Devarakonda Doesn't Want To Work With Rashmika Mandanna || Filmibeat Telugu

'గీత గోవిందం' భారీ విజయం అందుకోవడంతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హిట్ పెయిర్‌గా పేరు తచ్చుకున్నారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీలో కలిసి నటించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ కనీసం రెండు సంవత్సరాల పాటు కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నారట.

'గీతా గోవిందం' సమయంలో ఈ ఇద్దరిపై అనేక రూమర్స్ వచ్చాయి. ఈ మూవీ రిలీజ్ ముందే ముద్దు సీన్ లీక్ అవ్వడంతో వీరికి లింక్ పేట్టేస్తూ రకరకాల ప్రచారం జరిగింది. రష్మిక తన బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయిన తర్వాత కూడా పెళ్లి రద్దు చేసుకోవడానికి కారణం కూడా ఇదే అంటూ వార్తలు వినిపించాయి.

అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు

అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు

అభిమానుల నుంచి కూడా ఇద్దరూ ప్రేమలో ఉంటే బావుండు, వీరి జోడి చాలా బావుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా విజయ్ దేవరకొండ, రష్మిక ప్రొఫెషనల్ రిలేషన్ మెయింటేన్ చేస్తూ మంచి స్నేహితులుగా కంటిన్యూ అయ్యారు.

రెండేళ్లు కలిసి పని చేయకూడదని నిర్ణయం

రెండేళ్లు కలిసి పని చేయకూడదని నిర్ణయం

తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియాలో రష్మికపై ఆసక్తికరమైన ప్రశ్న సంధించారు. విజయ్‌తో ఎందుకు డేటింగ్ చేయడం లేదు అని అడిగిన అభిమానికి రష్మిక తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ.. మేము ఇద్దరం కూర్చుని డేటింగ్ చేయలేం. ఎందుకంటే మాకు అంతకు మించి చాలా పని ఉంది. మేము ప్రేమ, గౌరవాన్ని పని ద్వారానే చూపిస్తాం. నేను అతడిని చాలా చికాకు పెట్టాను. అందుకే మరో రెండు సంవత్సరాల పాటు నాతో కలిపి పని చేయకూడదు అనుకుంటున్నాడు' అని రష్మిక వ్యాఖ్యానించారు.

రష్మిక మందన్న

రష్మిక మందన్న

ప్రస్తుతం రష్మిక మందన్న.. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. సూపర్‌స్టార్‌తో ఆమెకు ఇది తొలి చిత్రం. తెలుగుతో పాటు పలు కన్నడ చిత్రాల్లో కూడా రష్మిక నటిస్తున్నారు. కార్తి హీరోగా తమిళంలో రూపొందబోయే ‘సుల్తాన్' మూవీ ద్వారా ఆమె తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఫైటర్' అనే చిత్రం చేయబోతున్నారు. పూరి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న మొదటి సినిమా. త్వరలో ఈ యంగ్ హీరో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బేనర్లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X