నా కోసం సందీప్ రెడ్డి ఇంటిని తాకట్టు పెట్టాడు.. ఆఫర్లు రాని రోజుల్లో.. విజయ్ దేవరకొండ

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాణిస్తూనే నిర్మాతగా మారిపోయాడు. పెళ్లి చూపులు సినిమా రిలీజ్‌కు ముందు ఎదురైన చేదు అనుభవాలు, గుణపాఠాలను దృష్టిపెట్టుకొన్న విజయ్ దేవరకొండ ఎప్పటికైనా నిర్మాతగా మారాలని ఒట్టు వేసుకొన్నాడట. ఆ క్రమంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ, అవంతిక లాంటి తారలతో మీకు మాత్రమే చెబుతా సినిమాను ప్రారంభించారు. నవంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

 ఎవడే సుబ్రహణ్యం సినిమా తర్వాత

ఎవడే సుబ్రహణ్యం సినిమా తర్వాత

ఎవడే సుబ్రమణ్యం తర్వాత మేము తీసిన పెళ్లిచూపులు సినిమాను రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు చేరే వేసేందుకు పక్కాగా ప్లాన్ వేసి నన్ను ఇంతటి వాడిని చేశారు. ఆ తర్వాత బుజ్జిసార్ నాకు గీతా గోవిందం ఇచ్చారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ సార్ నాకు ఫైటర్ ఇస్తున్నారు. ఇలా నన్ను ఆదుకొని నా కెరీర్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. నేను ఏమీ లేనప్పుడు నాకు ఎలా కొందరు సహకరించారో.. ఇప్పుడు నేను మరికొందరికి అండగా నిలువాలని అనుకొన్నాను. ఆ క్రమంలోనే మీకు మాత్రమే చెబుతా సినిమాను రూపొందించాను. నిర్మాతగా నన్ను దీవించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.

నా చేతలో డబ్బులు లేకుంటే

నా చేతలో డబ్బులు లేకుంటే

నేను డిగ్రీ చదివిన తర్వాత యాక్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో నా చేతిలో డబ్బులు లేకపోతుండే.. అప్పుడు మా నాన్న పూరిని కలిసి అసిస్టెంట్‌గా చేరు. ఆయన అసిస్టెంట్లకు బాగా డబ్బులు ఇస్తాడని చెప్పాడు. కానీ నేను ఆయనను కలువడానికి భయపడే వాడిని. అలాగే రామానాయుడు స్టూడియోలో అడుగుపెట్టి సురేష్ సార్‌ను కలువడానికి కష్టపడేవాడిని. కారు ఉంటే గానీ లోపలికి పోనిచ్చేవారు కాదు. అప్పుడు నాకు ఆల్టో కారు ఉండేది. ఆ కారును చూసి లోపలికి పంపించని రోజులు చాలా ఉన్నాయి అని విజయ్ దేవరకొండ చెప్పారు.

ఆఫర్లు రాని సమయంలో

ఆఫర్లు రాని సమయంలో

ఇక ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత నాకు మంచి ఆఫర్లు వస్తాయని అనుకొన్నాను. కానీ ఏడాది వరకు నాకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తరుణ్ భాస్కర్ నాకు పెళ్లిచూపులు కథ చెప్పి సినిమా తీద్దామన్నాడు. ఆ సమయంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మాతలుగా మాకు సహకారం అందించారు. ఆ సినిమాను సురేష్ సార్ రిలీజ్ చేసి నాకు మంచి కెరీర్‌ను ప్రసాదించారు.

సందీప్ రెడ్డి అలాంటి సాహసం

సందీప్ రెడ్డి అలాంటి సాహసం

పెళ్లి చూపుల తర్వాత అర్జున్ రెడ్డి నా కెరీర్‌ను మలుపు తిప్పింది. నాతో సినిమా తీయడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన ఇంటిని కుదువ పెట్టి డబ్బు సమకూర్చాడు. ఆ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. అలా అర్జున్ రెడ్డి నాకు ఓ జీవితాన్ని ప్రసాదించింది. అప్పుడే నా మాదిరిగా మరొకరు కష్టపడకూడదు అనిపించింది. అందుకే షమ్మీర్ సుల్తాన్ కథ చెప్పగానే సినిమా తీయాలనుకొన్నాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

అందుకే మీకు మాత్రమే చెబుతా

అందుకే మీకు మాత్రమే చెబుతా

మీకు మాత్రమే చెబుతా సినిమా రిలీజ్ ముందు.. తరుణ్ భాస్కర్ చెప్పిన విషయాలను నాకు బాగా నచ్చాయి. మీరు కనుక లేకపోతే చాలా మంది కెరీర్ ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టం. ఈ సినిమా వల్ల అవంతిక, వాణి లాంటి యాక్టర్ల ప్రతిభ సినీ లోకానికి తెలుస్తుంది. తరుణ్, అభినవ్ గోమటం కామెడీ, యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X