The Family Star: 200 కోట్ల రూపాయలు కొడుతా.. అది బలుపు కాదు.. విజయ్ దేవరకొండ
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో పాపులర్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్ నటించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, హిందీ, తమిళంలో రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించారు. ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
పెళ్లిచూపులు సినిమా సమయంలో మీరు మీ గురించి ఎలాంటి గాసిప్ వినాలని అనుకొంటున్నారు అని ఎవరో ప్రశ్న అడిగారు. అయితే నా సినిమా 100 కోట్లు కొట్టిందనే వార్త వినాలని ఉంది. అది నా డ్రీమ్ అని చెప్పాను. అయితే నా నాలుగో సినిమా గీతా గోవిందం మూవీకే నేను 100 కోట్ల రూపాయలు కొట్టాను. ఆ తర్వాత ఎన్నో పొగడ్తలు విన్నాను. ఎన్నో తిట్లు తిన్నాను. మీకు మంచి సినిమాలు ఇవ్వాలని ప్రయత్నించాను. కానీ నేను సక్సెస్ కాలేదు అని విజయ్ దేవరకొండ అన్నారు.

నా కెరీర్‌లో గీతా గోవిందం లాంటి సినిమా రాలేదు. 100 కోట్లు కొట్టిన పిల్లాడు 200 కోట్లు కొడుతానని చెప్పాను. కానీ ఆ సినిమా విషయంలో 200 కోట్లు కొట్టడం నాతో కాలేదు. అయితే నీ వయసుకు అలాంటి మాటలు ఎందుకు చెబుతావని చాలా మంది తిడుతారు. కొందరికి తల పొగరుగా కనిపిస్తుంటుంది అని నా ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది చెబుతుంటారు అని విజయ్ దేవరకొండ తెలిపారు.
అయితే నా యాటిట్యూడ్ విషయంలో ఈ రోజు ఒక విషయం మీకు చెప్పాలని అనుకొంటున్నాను. 200 కోట్లు కొడుతానని చెప్పడం తప్పు కాదు. 200 కోట్లు కొడతానని చెప్పి కొట్టకపోవడం తప్పు. దాని వల్ల చాలా తిట్లు తింటున్నా. అవమానాలకు గురి అవుతున్నాను. ఆ టార్గెట్‌ను కొట్టేంత వరకు మీరు తిడితే పడుతాను. ఇలా మాట్లాడితే బలుపు, తలబిరుసు అనుకొంటారు. కానీ అది నా మీద నాకు నమ్మకం అని అన్నాడు.

ప్రతీ రోజు బెడ్డు మీద నుంచి లేచినప్పుడు అదే నమ్మకంతో వెళ్తాను. షూటింగ్‌కు వెళ్తే అదే నమ్మకంతో వెళ్తాను. ఒకరు స్టార్ అయితే నేను స్టార్ కానా? నేను స్టార్ అయితే మీరు స్టార్స్ అవ్వలేరా? ఇంకొకరు 200 కోట్లు కొడితే.. మీరు కొట్టలేరా ఏంటి? మీ అందరికి ఎందుకు చెబుతున్నానంటే.. గీతా గోవిందం నుంచి నా జర్నీలో ఎందుకు చెబుతున్నానంటే.. మీరు కూడా హీరో,డైరెక్టర్, సంస్థకు యజమాని కావాలని కోరుకొంటారు అని విజయ్ దేవరకొండ అన్నారు.
మీ జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద కలలు కంటుంటారు. జయపజయాలు చూస్తుంటారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. ఒకసారి ఫిక్స్ అయితే వాటన్నింటిని దాటుకొంటూ వెళ్లాలి. నా తొలి సినిమా సమయంలో చెప్పాను. మీరు కన్న కలలను సాకారం చేసుకోవాలి. అందుకోసం తల ఎత్తుకొని నిలబడాలి. నా జీవితంలో ఫ్యామిలీ స్టార్ చాలా ముఖ్యమైంది అని విజయ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











