Baby మూవీ చూసి ఏడ్చా.. నేను చాలా డిస్ట్రబ్ అయ్యా.. విజయ్ దేవరకొండ
యువ హీరోలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలుపాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.జూలై 14న రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
చాలా రోజులుగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓ మంచి సినిమా విజయం సాధించినందుకు హ్యాపీగా ఉంది. యంగ్ టీమ్ సక్సెస్ సాధించినందుకు హ్యాపీగా ఉన్నా. ఓ తమ్ముడి సక్సెస్ చూసినందుకు అన్నలా హ్యాపీగా ఉన్నా. బేబీ సినిమాను జూలై 13వ తేదీన ప్రసాద్ ఐమాక్స్‌లో చూశా. సినిమా ముగిసిన తర్వాత డోర్ వద్ద ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇద్దరు ఉన్నారు. నేను ఏం చెబుతానని ఎదురు చూశారు. కానీ అప్పటీకే ఏడ్చి ఏడ్చి బయటకు వస్తుండటంతో గొంతు దగ్గర పడింది. అప్పుడు నేను ఏం చెప్పలేకపోయాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.

బేబీ సినిమా సినిమాకు మూడు పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒకటి సాయి రాజేష్, మరోకరు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానియన్. మూడో పిల్లర్ ఆనంద్, వైష్ణవి, విరాజ్ అని విజయ్ దేవరకొండ అన్నారు. బేబీ సినిమా గురించి అందరూ చర్చిస్తున్నారంటే.. నీవు ఎంత గొప్ప స్టోరీ టెల్లరో తెలుసుకోవాల్సిందే. మ్యూజిక్, నటీనటుల ఎంపిక ప్రతీది విజన్‌గా కనిపిస్తుంది. రాజేష్ నీవు చెప్పే కథలు చూసి ఫిదా అయ్యాను అని విజయ్ అన్నారు.
నేను చిన్నప్పుడు సినిమాను ఎక్సైట్ అయి చూసే వాడిని. కానీ యాక్టర్ అయ్యాక చాలా క్రిటికల్‌గా చూడటం మొదలుపెట్టాను. కానీ నాలో నటుడిని పక్కన పెట్టి సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లి చూపించిన మూవీ బేబీ. నేను ఫీలయ్య చూసిన సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఈ సినిమా చూస్తుంటే నిజంగా జరిగిందా అనే ఫీలింగ్ కలిగింది అని విజయ్ దేవరకొండ చెప్పారు.
అమ్మాయి ఇలా చెయ్యొద్దు.. అబ్బాయి అలా చేయవద్దు అని చెప్పే సినిమా బేబీ. ఈ సినిమా చూసేటప్పుడు నేను నా లైఫ్ గురించి ఆలోచించాను. అందరూ అలానే ఆలోచిస్తున్నారు కాబట్టే ఈ సినిమాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయిందనే ఫీలింగ్ కలుగుతున్నది. నేను చాలా మంది అమ్మాయిలను చూశాను. అందరూ ఇలాంటి అమ్మాయిలు ఉంటారని అనుకోవద్దు. నేను చాలా మంది అందమైన అమ్మాయిలను చూశాను. అబ్బాయిలను అమ్మాయిలు హర్ట్ చేసిన వారిని చూశాను. అమ్మాయిలను హర్ట్ అబ్బాయిలను చూశాను అని విజయ్ దేవరకొండ చెప్పాను
బేబీ సినిమా థియేటర్‌లో కూర్చోగానే.. ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాటతో సినిమా స్టార్ట్ అయింది. అప్పుడే నాకు అర్దమైంది. నేను ఏదో ఇంటెన్స్ సినిమా చూస్తున్నానని అర్ధమైంది.


Click it and Unblock the Notifications











