Vijay Deverakonda ఎవడు అడ్డొచ్చినా కొట్టి తీరుతాం..విజయ్ దేవరకొండ

పెళ్లిచూపులు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కీడా కోలా. ఈ సినిమాను వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ తదితరులు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి తమ సొంత బ్యానర్ సురేష్ పొడక్షన్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. చైతన్య రావు, జీవన్ తదితరులు నటించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరుగగా..విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కీడా కోలా నవంబర్ 3వ తేదీన థియేటర్‌లో రిలీజ్ అవుతున్నది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నన్ను మీ అందరికీ పరిచయం చేసిన డైరెక్టర్ తీసిన సినిమా. మన జీవితంలో కొన్ని విషయాలు డిసైడ్ చేస్తాయి. జీవితంలో ఎలాంటి మార్గాన్ని ఎంచుకొంటామో. ఈ రోజు ఎక్కడ ఉన్నామో.. మనం పెరిగిన వాతావరణం, మనం తీసుకొన్న నిర్ణయాలు మన లైఫ్‌ను డిసైడ్ చేస్తాయి అని విజయ్ దేవరకొండ అన్నారు.

Vijay Deverakonda emotional speech at Tarun Bhaskers Keeda cola pre Release event

మన లైఫ్ బాగా ఉంటే.. మనం కలిసి వ్యక్తుల ప్రభావం కూడా అందుకు కారణం. నేను తీసుకొంటున్న నిర్ణయాలు, తీసుకొన్న నిర్ణయాలు కూడా ఉన్నాయి. నేను కలిసిన వ్యక్తులు తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ్లు నా జీవితాన్ని మార్చారు. ఈ ముగ్గురు నా బంధువులు కాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో చదువుకొని ఒకే కలను కన్నాం. మాకు ఒకరికొకరం తప్ప వేరే బ్యాక్ గ్రౌండ్ లేదు అని విజయ్ దేవరకొండ తెలిపారు.

ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాగ్ అశ్విన్ నన్ను తీసుకొన్నాడు. ఆ సినిమా చూసి తరుణ్ భాస్కర్ నన్ను పెళ్లి చూపులు సినిమాలోకి తీసుకొన్నాడు. పెళ్లి చూపులు సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఆ సినిమాకు తరుణ్‌కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత కొంత మంది హీరోలకు ఈ నగరంలో ఏమైంది సినిమాతో లైఫ్ ఇచ్చాడు అని విజయ్ దేవరకొండ చెప్పారు.

Vijay Deverakonda emotional speech at Tarun Bhaskers Keeda cola pre Release event

పెళ్లి చూపులు సినిమా వచ్చి 7 సంవత్సరాలు అయింది. నేను ఎప్పుడు మరో సినిమా చేద్దామని చాలాసార్లు అడిగాను. త్వరలోనే తరుణ్ భాస్కర్‌తో సినిమా చేస్తాను. అతి త్వరలోనే ప్రకటిస్తాం. కీడా కోలా సినిమా నేను చూడలేదు. కానీ బాగుందని తరుణ్ చెప్పారు. ఎందుకంటే నేను తరుణ్ చెప్పిన మాటలు నమ్ముతున్నాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.

తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ లాంటి వాళ్లకు హిట్లు, సక్సెస్‌తో సంబంధం లేదు. వాళ్లకు ఒక సినిమా అటు ఇటు అయినా ఏం ఇబ్బంది ఉండదు అని అన్నారు. మా పాకెట్‌లో రూపాయి లేకపోయినా ప్రపంచం నాదే అంటూ తిరిగే వాళ్లం. ఇంత వరకు వచ్చామంటే.. మా మైండ్ సెట్ కారణం అని విజయ్ దేవరకొండ చెప్పారు.

Vijay Deverakonda emotional speech at Tarun Bhaskers Keeda cola pre Release event

తరుణ్ భాస్కర్, నాది మధ్య తరగతి కుటుంబం. డబ్బు సంపాదిస్తే.. కొంత కూడబెట్టుకోమని చెబుతుంటారు. సొంత ఇల్లు కట్టుకోవాలని చెబుతుంటారు. అలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చామని అన్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలోని డైలాగ్ చెబుతూ.. మధ్య తరగతి వాళ్లమైతే కలలు కనొద్దా? ఈ రోజు డబ్బులు లేకపోతే రేపు డబ్బు సంపాదించలేమా? ఎవడు అడ్డొచ్చిన గెలువలేమా ఏంటి? అంటూ అభిమానులను విజయ్ దేవరకొండ ఉత్సాహపరిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X