ఇబ్బందిగా మారింది, ఈ సినిమా చేసేవాడిని కాదేమో?: విజయ్ దేవరకొండ

By Bojja Kumar

Recommended Video

Vijay Devarakonda Speech @Geetha Govindam Success Meet

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా న‌టించిన సినిమా గీత గోవిందం. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి బ‌న్నీ వాస్ నిర్మాత. ఆగ‌స్ట్ 15న విడుద‌లైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇదో పెద్ద ఇబ్బందిగా మారింది

ఇదో పెద్ద ఇబ్బందిగా మారింది

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ప్రతి సినిమా తర్వాత ఇంత సక్సెస్ ఎక్స్ పెక్ట్ చేశారా? అని అడుగుతుంటే చేయలేదు, చేయలేదు అని చెప్పడం ఇబ్బంది మారింది. దీనికి ఏదైనా ఆన్సర్ వెతుక్కోవాలి. నేను సినిమా సినిమాకీ స‌ర్‌ప్రైజ్ చేద్దామ‌నుకుంటే, ప్ర‌తి సినిమాకూ ఆడియ‌న్స్ వారి రియాక్షన్‌తో నాకు షాక్ ఇస్తున్నారు. ఈ స‌క్సెస్ వెన‌కాల ముగ్గురు ముఖ్య‌మైన వారున్నారు' అన్నారు.

 ఈ సినిమా చేసేవాడిని కాదేమో?

ఈ సినిమా చేసేవాడిని కాదేమో?

వాసుగారు న‌న్ను పిలిపించి క‌థ విన‌మ‌ని చెప్పి, నేను ఆలోచిస్తూ ఉంటే `బాసూ.. ఇది యూనివ‌ర్శ‌ల్ సినిమా` అని చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. ఆయన ఆ రోజు కన్విన్స్ చేయకపోయి ఉంటే ఈ సినిమా చేయకపోయేవాడినేమో? ఇందులో నేను చేసిన పెర్సార్మెన్స్ కి కార‌ణం బుజ్జిగారే. `అర్జున్ రెడ్డి` త‌ర్వాత నేను ఇంత బాగా పెర్ఫార్మ్ చేశానంటే అందుకు కార‌ణం బుజ్జిగారు.

చాలా కంఫ‌ర్ట్ ఇవ్వడం వల్లనే నా పని నేను చేయగలిగాను

చాలా కంఫ‌ర్ట్ ఇవ్వడం వల్లనే నా పని నేను చేయగలిగాను

అర‌వింద్‌గారు షూటింగ్ సమయంలో రెండు, మూడు సార్లు లంచ్‌కి వ‌చ్చారు. షూటింగ్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఆయ‌న చాలా కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. సినిమాను ఆగ‌స్ట్ 15కి విడుద‌ల చేయ‌డానికి కూడా ఆయ‌నే కార‌ణం. న‌టుడికి చాలా కంఫ‌ర్ట్ ఇవ్వడం వల్లనే నా పని నేను చేయగలిగాను అన్నారు.

మెగాస్టార్‌ పెద్ద హృదయం

మెగాస్టార్‌ పెద్ద హృదయం

మెగాస్టార్‌ చిరు సర్‌ను ఈ ఫంక్షన్‌కు పిలవడానికి వెళ్లినపుడు ఆయన వెంటనే ఒకే చెప్పారు. గంట సేపు మాతో కూర్చుని సినిమాలోని డైలాగులు, యాక్ష‌న్లు, రియాక్ష‌న్లు చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. చిరంజీవిగారితో ఉంటే నేను అన్ని మరిచిపోతాను. ఆ సమయంలో నాకు ఏమ‌వుతుందో, నాలో ఏమ‌వుతుందో అర్థంకాదు. `సైరా` షూటింగ్‌ను మా కోసం కేన్సిల్ చేసుకుని వ‌చ్చారు. మా కోసం ఎందుకు ఇంత చేస్తున్నారు? అంటే ఆయ‌న పెద్ద మనసు తప్ప మరొకటి కాదు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X