Asia Cup 2023 తిలక్ వర్మపై విజయ్ దేవరకొండ హాట్ కామెంట్..భారత్ ఓటమి ఎరగదు అంటూ రౌడీ స్టార్
యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో రౌడీ స్టార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. టెలివిజన్ షోలు, మీడియా సమావేశాలతో బిజీగా ఉంటూనే.. అందరూ ఎదురు చూస్తున్న ఆసియా క్రికెట్ కప్‌పై దృష్టిపెట్టాడు. క్రికెట్ మ్యాచులకు యూత్ నుంచి మంచి రెస్సాన్స్ ఉండటం కారణంగా ఆ వేదికను ప్రచారానికి ఉపయోగించుకొన్నాడు. తాజాగా ఆసియా కప్ ప్రారంభం సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో కామెంటేటర్‌గా ప్రత్యక్షం అయ్యాడు. క్రికెట్ వేదికపై విజయ్ దేవరకొండ చెప్పిన వివరాల్లోకి వెళితే..
క్రికెట్ అభిమానించే వారిలో విజయ్ దేవరకొండ ఏ మాత్రం తగ్గడు. భారత్ తరఫున ఆడే ప్రతీ క్రీడాకారుడికి తాను, తన ఫ్యాన్స్ సపోర్టును పూర్తిస్థాయిలో ఇస్తుంటాడు. గతంలో ఐపీఎల్ పోటీల సందర్భంగా లైగర్ సినిమా కోసం భారీగా ప్రచారం చేశాడు. అలాగే ప్రస్తుతం ఆసియా కప్ (Asia Cup 2023)లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం సిద్దమయ్యాడు. సెప్టెంబర్ 2 జరిగే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

ఆసియా కప్ 2023 కర్టెన్ రైజర్ సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. భారత్‌కు చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్. ఆసియా కప్, వరల్డ్ కప్, మూడు నెలలపాటు ఐదు మ్యాచులు.. క్రీడాభిమానులకు పండుగే పండుగ. సెప్టెంబర్ 2వ తేదీన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ 2 గంటల నుంచి ప్రసారం అవుతుంది అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

స్టార్‌స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌తో మాట్లాడుతూ.. నాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ అంటే నాలా ఇష్టం. వారి ఆటను చూడటానికి అమితంగా ఇష్టపడుతాను. ఈ సారి భారత జట్టులో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను చేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. తిలక్ వర్మ టాలెంట్ గురించి అందరికి తెలుసు. ఈ ఆసియా కప్‌లో చెలరేగి ఆడటమే కాకుండా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాటం ఖాయమని అనుకొంటున్నాను. తిలక్ వర్మ ఇన్సింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాను అని విజయ్ దేవరకొండ అన్నాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆట చూస్తుంటే ఫుల్ జోష్ కలుగుతున్నది. ఆయన తర్వాత రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ఆట తీరు బాగుంది. హార్ధిక్ పాండ్యా, బూమ్రా, సిరాజ్ అర్షదీప్ ఆటగాళ్లతో జట్టు సమతూల్యంగా కనిపిస్తున్నది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌ను చూడటానికి ఉవ్విల్లూరుతున్నాను. దుబాయ్ స్టేడియంలో భారత్ ఓటమి ఎరుగదు. ఆ స్టేడియంలో నేను కూడా మ్యాచ్ చూశాను. కానీ ఈ సారి రీప్లేలు, కామెంటరీని బాక్స్‌లో మిస్ అవుతున్నాను. సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి రిలీజ్ అవుతున్నది కాబట్టి.. మ్యాచ్‌ను టెలివిజన్‌లోనే చూస్తాను అని విజయ్ దేవరకొండ అన్నాడు.

పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ అంటే.. అందరి మాదిరిగానే నాకు టెన్షన్ ఉంటుంది. ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడుతుంటే తెగ టెన్షన్ పడిపోతుంటాను. రెండు జట్ల మధ్య హోరాహెరీగా జరిగే పోరు.. అలాగే ఆటగాళ్ల మధ్య ఉండే భావోద్వేగాలను నన్ను మరింత టెన్షన్ పెడుతాయి. ఈ సారి ఆసియా కప్‌లో ఎక్సైటింగ్ మ్యాచ్‌లు చూసేందుకు రెడీ అవుతున్నాను. ఆసియా కప్ అందరికి జోష్ పంచుతుందని ఎదురు చూస్తున్నాను అని విజయ్ దేవరకొండ అన్నాడు.


Click it and Unblock the Notifications











