అతనైతే ఓకే అనేసిన విజయ్ దేవరకొండ.. షాకవుతున్న ఫ్యాన్స్

ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ మేనియా కొనసాగుతోంది. పెళ్లి చూపులు ఆయనకు మంచి పుషింగ్ ఇవ్వగా అర్జున్ రెడ్డి సినిమా మొదలు ఇక ఈ యంగ్ హీరో పట్టిందల్లా బంగారమే అవుతోంది. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి వరుస హిట్స్ ఆయన్ను స్టార్ హీరో చేసేశాయి. దీంతో నిర్మాతలంతా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి, మంచి లాభాలు కూడగట్టుకోవాలని తహతహలాడుతున్నారు.

మరోవైపు ఇపుడిప్పుడే ఇండ‌స్ట్రీలోకి ద‌ర్శ‌కులుగా నిరూపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్న చాలా మంది ద‌ర్శ‌కులు విజ‌య్‌దేవ‌రకొండ బాడీ లాంగ్వేజ్‌కు త‌గిన‌ట్లు క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్‌ దర్శకత్వంలో ఓ సినిమా అలాగే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమాకు కమిటయ్యారు ఈ క్రేజీ హీరో.

Vijay Deverakonda green signal for Hanu Raghavapudi

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో మరో సినిమా ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇటీవలే పడి పడి లేచే మనసు రూపంలో హను డిసాస్టర్ మూట గట్టుకున్నా కూడా విజయ్ దేవరకొండ ఆ డైరెక్టర్ పై నమ్మకంతో ఉన్నాడంటే అభినందించాల్సిన విషయమే. స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. అంటే ఇప్పటికే ఈ బ్యానర్ పై ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి లాంటి చిత్రాలు చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మూడో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడన్నమాట. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమా కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా మిల‌ట‌రీ నేప‌థ్యంలో విభిన్న కథాంశంతో ఉండనుందట. అన్నీ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే ప‌డి ప‌డి లేచె మ‌న‌సు త‌ర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మిదే అవుతుంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావటానికి కొంత సమయం పెట్టొచ్చని తెలుస్తోంది. ఎలాగూ విజయ్ దేవరకొండ ఓకే అన్నారు కాబట్టి ఈ సినిమాతో హను దశ తిరుగుతుందా అనేది చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X