ఆ మూడు సినిమాల వరకు మూసుకొని కూర్చొంటా.. అదే నేను విధించుకొన్న శిక్ష.. విజయ్ దేవరకొండ
భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ నటించిన ప్రేమ కథా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం డైరెక్టర్ పరశురామ్ రూపొందించారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా మీడియాతో విజయ్ దేవరకొండ, దిల్ రాజు, మృణాల్ ఠాకూర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ స్పందిస్తూ..
మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్ లోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు గోవర్థన్ అనే పేరు పెట్టమని చెప్పాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

ఖుషి సినిమా దాకా హీరోగా నేను తీసుకున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. ముందు హీరోగా నిలబడాలని మాత్రమే ఆలోచించా. ఎప్పుడూ డబ్బుల కోసం చూసుకోలేదు. కానీ కోవిడ్ టైమ్ లో నా స్టాఫ్ జీతాలు, మెయింటనెన్స్ ఇవన్నింటికీ ఇబ్బంది కలిగింది. అప్పటి నుంచి మన మార్కెట్ వ్యాల్యూకు తగినట్లు ఫీజు తీసుకోవాలి అనుకుని ఫిక్స్ అయ్యా అని విజయ్ దేవరకొండ తెలిపారు.
లైగర్ సినిమాకు ముందు.. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పులేదు. నేను ముందు అలాగే ఉన్నాను. ఇప్పడు అలానే ఉన్నాను. నేను రిజల్ట్స్ డిక్లేర్ చేయడం లేదు. మూడు సినిమాల వరకు మూసుకొని కూర్చొంటాను. అదే నాకు నేను శిక్ష విధించుకొన్నాను. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు లభించిందనుకొంటాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

దిల్ రాజు సమాధానం ఇస్తూ.. ఎవరైనా కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒకలా.. పెళ్లైనా తర్వాత మరోలా, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటారు. కాలేజ్‌లో ఉన్నట్టు పెళ్లి తర్వాత ఉంటే నడవదు. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి సమయంలో ఉన్నట్టు నడవదు. పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు పెరిగిపోతాయి. సినిమా పరిశ్రమలో కూడా అలాగే ఉంటుంది. కెరీర్ ముందుకు పోయిన కొద్ది మార్పులు లభించడం సహజం అనేది గుర్తించాలి అన్నారు.


Click it and Unblock the Notifications











