హాస్పిటల్‌ చేరిన విజయ్ దేవరకొండ.. ఏం జరిగిందంటే.. డియర్ కామ్రేడ్ క్లారిటీ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో దక్షిణాదిలో విజయ్ దేవరకొండ హాట్ హీరోగా మారిపోయాడు. తనదైన యాటిట్యూడ్‌తో తెరపై విజృంభిస్తున్న ఆయన త్వరలోనే డియర్ కామ్రేడ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే డియర్ కామ్రేడ్‌కు సంబంధించి విపరీతమైన షూటింగ్ ఒత్తిడి అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీగా మారడంతో విజయ్ దేవరకొండ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఆయన ఇటీవల హాస్పిటల్‌లో చేరడంతో అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. అసలేం జరిగిందంటే..

మండుటెండల్లో షూటింగ్ వల్ల

మండుటెండల్లో షూటింగ్ వల్ల

విజయ్ దేవరకొండ ఆస్పత్రిలో చేరడంపై మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ కారణంగా క్షణం తీరిక లేకుండా పనిలో మునిగిపోయాడు. దాంతో ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటడంతో హాస్పిటల్‌లో చేరాడు. వేసవి మండుటెండల్లో షూటింగ్ చేయడంతో అనారోగ్యానికి లోనయ్యాడు అని పేర్కొన్నారు.

రాత్రింబవళ్లు షూటింగ్‌తో

రాత్రింబవళ్లు షూటింగ్‌తో

తాను అనారోగ్యానికి గురికావడంపై వచ్చిన వార్తలపై ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. హోళికి ముందు రోజు ఉదయం 6 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొన్నాను. దాంతో నిద్ర లేకపోవడం, కొంత పని ఒత్తిడి ప్రభావం మీద పడింది. ఎందుకైనా మంచిదని నేను హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకొన్నాను అని విజయ్ దేవరకొండ వెల్లడించినట్టు కథనంలో పేర్కొన్నారు.

రష్మిక మందన్నతో కలిసి మరోసారి

రష్మిక మందన్నతో కలిసి మరోసారి

గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి పెట్టిన ఫైట్ ఫర్ వాట్ యూ లవ్ అనే ఉప శీర్షిక ఆసక్తిని రేపుతున్నది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రెండ్ అవుతున్న వాటిలో ఒకటిగా నిలిచింది. టీజర్లో ముద్దుపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నది.

బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అంటూ

బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అంటూ

విజయ్ దేవరకొండ ముద్దు సీన్లలో మునిగి తేలడంపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా సంపాదించిన హీరోల్లో ఒకడిగా మారి ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన విజయ్ దేవరకొండ‌ను రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ముద్దు సీన్లలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మిని మించిపోతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X