twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పటికే చాలా నాశనం చేశాం... ఇకనైనా కళ్లు తెరవండి: విజయ్ దేవరకొండ

    |

    భారత దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉన్న నల్లమల అడవుల్లో యూరేనియం గనుల తవ్వకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ ఫారెస్టు ఏరియాలో మైనింగ్ చేసేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ కమిటీ సముఖంగా ఉన్నట్లుగా వార్తలు రావడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరుపడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. నల్లమలను రక్షించాలని జరుగుతున్న ఉద్యమంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ చేరారు.

    నల్లమల నాశనం అయ్యే పరిస్థితి తేవొద్దు

    నల్లమల నాశనం అయ్యే పరిస్థితి తేవొద్దు

    20వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న నల్లమల ఫారెస్ట్ ప్రమాదంలో పడింది, అది నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఇప్పటికే చెవులను నాశనం చేశాం.. ఫలితంగా రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మన తాగునీటి వనరులను కలుషితం చేశాము. మన గాలి నాణ్యత ప్రతిచోటా క్షీణిస్తోంది, వివిధ నగరాలు నీటి కరువుతో అల్లాడుతున్నాయి. ఇపుడు మనం మిగిలి ఉన్న కాస్త మంచిని కూడా నాశనం చేయడాన్నిసమర్థిస్తూనే ఉన్నాము... అంటూ నల్లమలపై విజయ్ దేరవకొండ తన గళం వినిపంచారు.

    యూరేనియం కొనుక్కోవచ్చు, కానీ అడవులను కొనగలమా?

    యూరేనియం కొనుక్కోవచ్చు, కానీ అడవులను కొనగలమా?

    ‘యూరేనియం పేరుతో పచ్చని నల్లమల అడవులు నాశనం చేసే ప్రయత్నం మొదలైంది. మీకు యూరేనియం కావాలంటే కొనండి, యూరేనియం కొనుక్కోవచ్చు, కానీ అడవులను కొనగలమా? కొనడం కష్టం అనుకుుంటే సోలార్ ఎనర్జీని డెవలప్ చేయండి, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ పెట్టడం తప్పనిసరి చేయండి.'' అంటూ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

    What the F** అంటూ విజయ్ దేవరకొండ ఫైర్

    What the F** అంటూ విజయ్ దేవరకొండ ఫైర్

    ఇంత చెప్పినా యూరేనియం తవ్వకాలనను ఎవరైనా సమర్ధించాలనుకుంటున్నారా?... మనకు తాగడానికి స్వచ్ఛమైన నీరు, స్వాశ తీసుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేనపుడు ఈ యూరేనియం, ఎలక్ట్రిసిటీ ఏం చేసుకుంటాం? WTF(What the F**) అంటూ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు.

    యూరేనియం తవ్వకాల వల్ల ఏం జరుగుతుంది?

    యూరేనియం తవ్వకాల వల్ల ఏం జరుగుతుంది?

    నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల చేపట్టడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది, కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది కాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల కాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది.

    English summary
    Telugu actor Vijay Devarakonda tweeted against the destruction of the Nallamala forests for uranium mining. He has revealed his thoughts in the name of #SaveNallamala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X