సౌతిండియా ‘హీరో’గా ఎదుగుతున్న విజయ్ దేవరొకండ, సినిమాటోగ్రాఫర్ కూతురుతో...
Recommended Video

'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా ఏర్పడ్డ తన స్టార్ ఇమేజ్ కేవలం తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితం చేయకుండా సౌత్ మొత్తానికి విస్తరిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే అతడు నటించిన 'నోటా' తమిళంలో విడుదలైంది.
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, మలయాళంలో సైమల్టేనియస్‌గా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 'హీరో' అనే టైటిల్ ఫైనలైజ్ చేశారు.

హీరో
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ‘హీరో' చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఢిల్లీలో షూట్ చేయబోతున్నారు. ‘హీరో' మూవీ స్టోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోందని, ఇందులో విజయ్ ప్రొఫెషనల్ బైకర్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.

‘మహర్షి' మూవీ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురుతో
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించబోతోంది. మాళవిక మోహనన్ మరెవరో కాదు... ‘మహర్షి' మూవీ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురు.

కొత్త దర్శకుడు
‘హీరో' చిత్రానికి కొత్త డైరెక్టర్ ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటి వరకు విజయ్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందట.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రెడ్' చిత్రం చేస్తున్నారు. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా, కార్మిక నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్ర విజయాలతో డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన మరోమారు ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











