నేను సింగిల్ కాదు.. రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. అఫైర్ గురించి విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమాను జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేసింది. నిర్మాత నాగవంశీ సారథ్యంలో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాతీయ మీడియాలో ముచ్చటించారు. ఈ సందర్భంగా హాలీవుడ్ రిపోర్టర్ అనుపమ్ చోప్రాతో మాట్లాడుతూ.. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఒపెన్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విషయాల్లోకి వెళితే..
ఫెయిల్యూర్స్ నాకు గుణపాఠం నేర్పుతాయి. సక్సెస్ కంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడే ఎక్కువ నేర్చుకొంటాం. ఫెయిల్యూర్ ఎదురైనప్పడు గుండెలో ఊపిరి ఆడదు. ప్రపంచం ఏదో కోల్పోయినట్టు ఫీలవుతాం. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే పరాజయాలు ఎదురవుతాయి. అప్పుడు నాకు పెద్దగా బాధ అనిపించదు. కానీ ఫెయిల్యూర్.. ఫెయిల్యూరే. ఆ సమయంలో ఇంకా మెచ్యుర్డ్‌గా ఆలోచిస్తాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

ఇండస్ట్రీ బయట నుంచి రావడం వల్ల కొన్ని సౌకర్యాలు ఉండవు. ఎవరైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ నా వద్దకు వచ్చి కథ చెప్పినప్పుడు.. అందులో ఏమైనా సందేహాలు, లోపాలు ఉంటే ముఖం మీదే చెప్పి.. నేను ఇది చేయలేను. ఈ స్క్రిప్టులో మార్పులు చేయమని అడిగే ఛాన్స్ ఉండదు. అదే ఇండస్ట్రీలో బ్యాకప్ ఉండి.. కుటుంబ సభ్యులు అప్పటికే మంచి హోదాలో ఉంటే.. తన వారసుల కోసం తండ్రి, ఇంకా ఎవరో ఒకరు వచ్చి స్క్రిప్టు చేయమని అడిగే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు షూటింగ్‌కు వెళ్లకుండా ఉండేలా ఆపొచ్చు. ఈ సౌకర్యం అవుట్ సైడర్స్‌కు ఉండదు అని విజయ్ దేవరకొండ చెప్పారు.
నేను కొన్నిసార్లు ఒక విషయం మాట్లాడితే.. మరోలా ప్రొజెక్ట్ అవుతుంది. ప్రమోషన్స్‌లో మాట్లాడటం చాలా ట్రీక్కీగా ఉంటుంది. అందుకే నా టీమ్ .. నీవు ఎక్కువగా మాట్లాడకూడదు. తక్కువగా సమాధానం చెప్పు అంటారు. కానీ నేను ఏదో విషయంలో మాట్లాడలేకుండా ఉండలేను. అలాంటి పరిస్థితిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.
అయితే అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌పై మాట్లాడుతూ.. నా వయసు 35 సంవత్సరాలు. నేను సింగిల్ కాదు. నేను ప్రైవేట్ లైఫ్‌ను లీడ్ చేయాలని అనుకొంటాను. ఇంతకుమించి నేను ఎక్కువగా చెప్పలేను. ఎవరేమీ అనుకొన్నా.. ఎవరు ఏమీ రాసినా నేను పట్టించుకోను. ప్రతీ ఒక్కరికి ఓ జీవితం ఉంటుంది. నా జీవితం యాక్టింగ్.. మిగితావన్నీ సెకండరీ అనే విధంగా మాట్లాడారు.
అయితే హాలీవుడ్ రిపోర్టర్ అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పడంతో రష్మిక మందన్నతో ఉన్న అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే వారిద్దరి డేటింగ్ లైఫ్ గురించి మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. ముంబై, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వారిద్దరు కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్స్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి ఫుల్లుగా క్లారిటీ ఇవ్వడం ఫ్యాన్స్‌ను ఆనందాన్ని పంచింది.


Click it and Unblock the Notifications











