ప్రేమ, పెళ్లి పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వారి గుండెలు బద్దలు కొట్టలేనంటూ!
పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ముందు సినిమా అవకాశాలు అందుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన అనూహ్యకాలంలోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన క్రేజ్ ఎల్లలు దాటి ఇండియా రేంజ్ కు వెళ్ళిపోయింది. తాజాగా ఆయన కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనగా అందులో తన ప్రేమ గురించి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

పెళ్లి గురించి
లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సారా అలీ ఖాన్ విజయ్ తో డేటింగ్ కి వెళ్లాలని ఉందంటూ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆయన ప్రేమ గురించి పెళ్లి గురించి మళ్ళీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాఫీ విత్ కరెంట్ కరణ్ షోలో తాజాగా అనన్యతో కలిసి సందడి చేసిన విజయ్ దేవరకొండ తన ప్రేమ గురించి పెళ్లి గురించి కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

స్క్రీన్ సేవర్ గా
దానికి సంబంధించి కొత్త ప్రోమో ఒకటి విడుదలైంది. ఇప్పుడు ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా తన రిలేషన్స్ స్టేటస్ గురించి విజయ దేవరకొండ ఓపెన్ అయ్యాడు. కచ్చితంగా నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనే రోజు గట్టిగా చెబుతానని కామెంట్ చేశాడు. అప్పటివరకు నన్ను ప్రేమించే వారిని బాధ పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఒక యాక్టర్ గా తనని ప్రేమిస్తూ తన పోస్టర్స్ సైతం ఇంట్లో పెట్టుకున్న వారు చాలా మంది ఉంటారని అలాగే తన ఫోటోలు కూడా చాలా మంది మొబైల్స్ స్క్రీన్ పై స్క్రీన్ సేవర్ గా ఉంటాయని చెప్పుకొచ్చాడు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో
వారు ఎప్పటికీ నా మీద అభిమానాన్ని గౌరవాన్ని తగ్గించుకోరని అలాంటి నేపథ్యంలో నేను వారి గుండెని ముక్కలు చేయాలనుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ అనన్య పాండే కలిసి పాల్గొన్న ఈ కాఫీ విత్ కరణ్ షో ఎపిసోడ్ జూలై 28వ తేదీన సాయంత్రం ఏడు గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది.
సంయుక్తంగా
ఇక విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ అనే సినిమాని తెరకెక్కించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

వార్తల్లో ఉండేలా
కేవలం తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచేసింది ఈ నేపద్యంలో సినిమా విడుదల అయ్యే వరకు ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేలాగా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











