Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రామ్ చరణ్, మహేష్ బాబుకు ధీటుగా విజయ్ దేవరకొండ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో!
Recommended Video
టాలీవుడ్ యంగ్ హీరోలు చాలా డిఫెరెంట్‌గా ఆలోచిస్తున్నారు. కేవలం సినిమానే లోకం అనుకోకుండా పలు విదాలుగా డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలు బిజినెస్ మాన్‌లుగా మారిపోగా.. ఇప్పుడు అదే బాటలోకి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అడుగులు కూడా పడుతున్నాయని సమాచారం. అంటే రామ్ చరణ్, మహేష్ బాబుకు ధీటుగా విజయ్ దేవరకొండ బిజినెస్ చేయనున్నాడన్నమాట. ఇక ఆ వివరాలు చూస్తే..

రౌడీ బ్రాండ్ దుస్తులు
టాలీవుడ్ యంగ్ హీరో ఇప్పటికే రౌడీ బ్రాండ్ దుస్తుల పేరిట వ్యాపార రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్రాండ్‌కి మంచి గుర్తింపు లభించడమే గాక ఓ రేంజ్‌లో వ్యాపారం సాగుతోంది. అయితే దీనికి కొనసాగింపుగా తాజాగా విజయ్ దేవరకొండ మరో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కింగ్ ఆఫ్ ది హిల్స్
సినిమాల పరంగా రోజు రోజుకూ విజయ్ దేవరకొండ డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల వలె తాను కూడా ఈ డిమాండ్ ని క్యాచ్ చేసుకునేలా కింగ్ ఆఫ్ ది హిల్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. కాకపోతే ఇప్పటి వరకూ ఈ బ్యానర్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి కొద్దిరోజుల్లో ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు యాక్టీవేట్ చేయనున్నాడట ఈ రౌడీ స్టార్.

ఫిక్స్.. ఇక సొంత బ్యానర్ లోనే
ఇకపై తన సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేయాలని విజయ్ దేవరకొండ ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ఇతర నిర్మాతలతో ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేసి.. ఆ వెంటనే తన సొంత నిర్మాణ సంస్థ లోనే సినిమాలు చేసుకునేలా విజయ్ దేవరకొండ ప్రణాళికలు రచిస్తున్నారు. ఎలాగూ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని రూపంలో సినీ గడప తొక్కుతున్నాడు కాబట్టి ఇక తమ సినిమాలు తామే రూపొందిచుకొని లాభాలు పట్టేలా విజయ్ ప్లాన్ చేస్తున్నాడట.

రామ్ చరణ్, మహేష్ బాబు
ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ బాబు సినీ రంగానికి సంబందించిన వ్యాపారాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కొనియెడల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించగా, మహేష్ ఏఎంబీ సినిమాస్ పేరుతో భారీ మల్టిప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా వీరి బాటలోనే ఆలోచనలు చేస్తుండటం ఆయన అభిమానులను ఖుషీ చేస్తోంది. చూడాలి మరి ఈ రౌడీ స్టార్ రామ్ చరణ్, మహేష్ బాబుకు ధీటుగా బిజినెస్ చేస్తాడా? లేక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడా? అనేది.