8 ఏళ్ల క్రితం స్లీపర్ బస్సులో.. నా ముఖాన్ని, పేరు గుర్తుంచుకొండి: ముంబైలో విజయ్ దేవరకొండ స్పీచ్ కేక
దేశంలోని ప్రధాన నగరాల్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లైగర్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ముంబైలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ప్రసంగాలకు విశేషమైన ఆదరణ లభిస్తున్నది. ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

నా పేరు బాగా గుర్తుంచుకోండి
హల్లో ముంబై, ఎలా ఉన్నారు.. నా హిందీ అంతా పక్కాగా ఉండదు. స్త్రీలింగానికి బదులు పుల్లింగం.. పుల్లింగానికి బదులు స్త్రీలింగం వాడుతుంటాను. ఏది మాట్లాడినా నా హృదయంతో మాట్లాడుతాను. కాబట్టి తప్పులు ఉంటే పట్టించుకోకండి. నేను ప్రేమతో చెప్పే విషయాలు మీకు అర్ధం అయితే చాలు. నా పేరు విజయ్ దేవరకొండ. మీలో ఎవరికైనా తెలియకపోతే బాధ లేదు. ఈ ముఖాన్ని మీరు బాగా గుర్తుంచుకొండి. ఈ ముఖం, నా పేరు గురించి మున్ముందు బాగా వినబోతున్నారు. నా గుండెలో అగ్గి ఉంది. ప్రపంచానికి అగ్గిపెట్టేద్దాం అని విజయ్ దేవరకొండ అన్నారు.

8 ఏళ్ల క్రితం స్లీపర్ బస్సులో
గతంలో 8 సంవత్సరాల క్రితం స్లీపర్ బస్సులో ముంబైకి తొలిసారి వచ్చాను. అప్పుడు చాలా రోజులు ఉన్నాను. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత నేను కొండంత ప్రేమతో మీ వద్దకు వచ్చాను. థ్యాంక్యూ ముంబై.. ఐ లవ్ యూ అంటూ లైగర్ సినిమాలో మాదిరిగా చెప్పారు. ముంబై మాల్‌లో జరిగిన ఈవెంట్‌కు భారీగా యూత్ తరలి వచ్చారు. విజయ్ మాట్లాడినంత సేపు అమ్మాయిలు కేరింతలు, అరుపులతో వేదిక ప్రాంగణాన్ని కేక పెట్టించారు.

లైగర్ అనే జబర్దస్త్ సినిమాతో
లైగర్ అనే జబర్దస్త్ సినిమాను తీశాం. ఆగస్టు 25 తేదీన లైగర్ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ట్రైలర్ మీరు చూశారా? మరోసారి ఈ ట్రైలర్ మీకు చూపిస్తాను. మీరు తొక్కిసలాటకు గురికావొద్దు. ఏ ఒక్కరికి గాయమైనా నేను తట్టుకోలేను. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండండి అంటూ విజయ్ దేవరకొండ చెప్పారు. విజయ్ దేవరకొండ ఈవెంట్లకు విశేష స్పందన లభిస్తున్నది.

విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ జోరు
విజయ్ దేవరకొండ అన్నీ తానై ముంబై మహా నగరంలో లైగర్ ప్రమోషన్స్‌తో జోరును కొనసాగిస్తున్నాడు. లైగర్ సినిమాకు దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమా కోసం యూత్ ఎప్ప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నది. ముంబైలో పలు ప్రదేశాల్లో నిర్వహించిన ఈవెంట్లకు భారీ స్పందన లభిస్తున్నది.
నటీనటులు
నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలీ, మక్రంద్ దేశ్ పాండే, గెటప్ సీను తదితరులు
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
సినిమాటోగ్రఫి: విష్ణు శర్మ
స్టంట్ డైరెక్టర్: కెచా (థాయ్‌లాండ్)
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ భాషా
ఎడిటర్: జునైత్ సిద్దిఖీ
బ్యానర్: పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2022-08-25


Click it and Unblock the Notifications











