టాలీవుడ్ హీరోలకు విజయ్ దేవరకొండ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టారా?

Recommended Video

Vijay Deverakonda Promoting Dear Comrade In Different Style || Filmibeat Telugu

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఇలా విజయాలు నమోదు చేసుకుంటూ తక్కువకాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హోదా సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ వారం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ కెరీర్లో తొలిసారిగా 4 భాషల్లో విడుదలవుతున్న చిత్రమిది. టాలీవుడ్లో కేవలం కొందరు స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైప మల్లీ లాంగ్వేజ్ రిలీజ్ విజయ్ ఇంత తక్కువ సమయంలోనే రీచ్ కావడం విశేషం. ఈ సినిమా ప్రమెషన్స్ కోసం విజయ్ సౌతిండియాలోని 5 రాష్ట్రాలు పర్యటిస్తూ తనదైన శైలిలోలో ముందుకు సాగుతున్నారు.

ఇప్పటి వరకు ఏ హీరో చేయని విధంగా...

ఇప్పటి వరకు ఏ హీరో చేయని విధంగా...

ఇప్పటి వరకు తెలుగులో ఏ స్టార్ హీరో చేయని విధంగా విజయ్ తనదైన శైలిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ స్వయంగా ఆడి, పాడి ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో ‘డియర్ కామ్రేడ్' చిత్రంపై సౌతిండియా వైడ్ భారీ హైప్ వచ్చింది.

ఇతర రాష్ట్రాల్లోనూ విజయ్ దేవరకొండ క్రేజ్

ఇతర రాష్ట్రాల్లోనూ విజయ్ దేవరకొండ క్రేజ్

రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల బెంగుళూరులో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు అభిమానులు పోటెత్తడంతో లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాలీవుడ్ హీరోలకు ఇదో కొత్త తలనొప్పి కానుందా...

టాలీవుడ్ హీరోలకు ఇదో కొత్త తలనొప్పి కానుందా...

సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ చేస్తున్న సరికొత్త ప్రయోగాలు.. టాలీవుడ్ హీరోలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ సక్సెస్ అయితే రేపు ఇతర హీరోలపై కూడా ఇదే తరహాలో ప్రమోషన్స్ నిర్వహించాలని నిర్మాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X