Virosh Sangeet Photos: రష్మికను కౌగిలిలో బంధించిన విజయ్ .. సంగీత్ ఫోటోలు వైరల్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి కార్యక్రమాలు రాజరికం ఉట్టిపడేలా ఓ మహోత్సవంలా జరిపించారు. నేషనల్ క్రష్ రష్మిక, విజయ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీగా సెలబ్రేషన్ప్‌ను నిర్వహించారు. ప్రతీ నగరంలో, వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు, బహుమతులు పంచుతూ అభిమానులపై ఉన్న తమ ప్రేమను నూతన వధూవరులు చాటుకొన్నారు.

ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన ప్రైవేట్ కార్యక్రమంగా సాగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా ట్రెండింగ్ అవుతున్నాయి. రౌడీ స్టార్ చేసిన ఫోటోలు మీ కోసం..

Virosh Sangeet Photos

మా సంగీత్ నైట్ ఫోటోలు, అనుభూతులను మీ కోసం షేర్ చేస్తున్నాను. ఆ రాత్రి మేము నవ్వుల్లో ఎంతగా మునిగిపోయామంటే.. ఆనందంతో కన్నీళ్లు వచ్చేంతగా.. మేము ఎంత బాగా డ్యాన్స్ చేశామంటే.. మా కాళ్లు నొప్పి పుట్టేంతగా.. ప్రతీ ఒక్కరి భావోద్వేగమైన స్పీచ్‌ మాలో ఫుల్లుగా ఎమోషన్స్ నింపింది. మా గురించి చెప్పిన మాటలకు మా ఎమోషన్స్ కన్నీటి ధారగా మారాయి అని విజయ్ దేవరకొండ అన్నారు.

సంగీత్ పార్టీలో అందమైన అతిథులతో నిండిపోయింది. డిజైనర్ ఫాల్గునీ చేసిన దుస్తుల అలంకరణ మాలోని డ్రాగన్స్‌ను ఉదయం నాలుగు గంటల వరకు బయటకు తీసుకొచ్చింది.

సంగీత పార్టీలో రష్మికను తన కౌగిలిలో బంధించిన విజయ్‌ తన ఆనందంలో మునిగి తేలుతూ వేగంగా గిరగిరా తిప్పుతూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ వీడియోను విజయ్ షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు.

రష్మిక కళ్లలోకి చూస్తూ తన ప్రేమను విజయ్ కురిపిస్తుండగా కెమెరాలు క్లిక్ మన్నాయి. బంధువులు, స్నేహితులందరూ ఆ మధురమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలిపారు.

సంగీత్ కార్యక్రమంలో ప్రతీ అంశం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వేదిక వద్దకు అద్బుతంగా అలంకరించిన వింటేజ్ కారులో విజయ్, రష్మిక ఇద్దరు బ్రహ్మండమైన స్వాగతంతో ఆహ్వానించారు.

సంగీత్ పార్టీలో విజయ్‌తో కలిసి పూర్తిగా మరో ప్రపంచంలో రష్మిక మందన్న విహరించిందా? అనేంతగా తన హావభావాలను ప్రదర్శించారు. మీ కోసం స్పెషల్ ఫోటోలు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X