విజయ్ దేవరకొండ పేరిట అరుదైన రికార్డు: దక్షిణాదిలోనే మొదటి హీరోగా ఘనత

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించి.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి.. ఆ తర్వాత హీరోగా పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'మహానటి' వంటి భారీ విజయాలను అందుకున్న అతడు.. ఇటీవలి కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటూ సతమతం అవుతున్నాడు. అయినప్పటికీ అతడి క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ రౌడీ స్టార్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్‌లో పంచుకుంటుంటాడు. దీంతో అతడిని ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 10.9 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ట్విట్టర్‌లో మాత్రం చాలా తక్కువగా అంటే 2.1 మిలియన్ ఫ్యామిలీని దక్కించుకున్నాడు. అలాగే, ఫేస్‌బుక్ ఖాతాలోనూ 1.6 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్నాడు. ఇంకా మిగిలిన సామాజిక మాధ్యమాల్లో అతడిని ఫాలో అయ్యే సంఖ్య 20 మిలియన్‌కు చేరుకుంది.

Vijay Deverakonda Reach 20M Followers On Social Media

ఇదిలా ఉండగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీన్ని పూరీ, ఛార్మీతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబై నగరంలో జరుగుతోంది. దీన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. వినాయక చవితి కానుకగా దీన్ని సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X