ఈ కుర్రాడు ఇప్పుడు సూపర్ పవర్ స్టార్.. గుర్తుపట్టారా?
టాలీవుడ్‌లో హాటెస్ట్ హీరో అంటే విజయ్ దేవరకొండనే అని చెప్పవచ్చు. నాలుగు సూపర్ హిట్లతో తెలుగు పరిశ్రమకు స్టార్ పవర్ ఏంటో చూపించాడు. ప్రస్తుతం గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ దేవరకొండ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాల వైరల్ అయింది. ఆ ఫోటో బయటకు ఎలా వచ్చిందంటే..
Recommended Video


సత్యసాయి యూనివర్సిటీలో
అనంతపురంలోని సత్యసాయి యూనివర్సిటీలో విజయ్ దేవరకొండ స్టడీస్ జరిగాయి. అక్కడే పదో తరగతి వరకు విద్యాభాసం పూర్తి చేసుకొన్నాడు. ఈ ఫోటో పదో తరగతి చదువుకొంటున్నప్పుడు దిగినప్పటిది.

అమ్మాయి పోస్ట్ వైరల్
సత్యసాయి యూనివర్సిటీలో చదువుకొనేటప్పడు మనోహర్ అనే సహా విద్యార్థి విజయ దేవరకొండకు క్లోజ్ ఫ్రెండ్. ఆ వ్యక్తి నుంచి ఓ అమ్మాయి తీసుకొని విజయ్ దేవరకొండ బాల్యంలో.. ప్రస్తుతం అర్జున్‌రెడ్డిగా అంటూ రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలోకి వదిలేసింది.

షాక్ తిన్న విజయ్
ఓ అమ్మాయి పోస్ట్ చేసిన ఫోటో వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ షాక్ తిన్నాడు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి ఈ విషయాన్ని బయటపెట్టింది. దాంతో ‘నా ఫోటో ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కాలేదు. లీకు జరిగింది ఇక్కడ నుంచా అని విజయ్ దేవరకొండ కంగుతిన్నాడు.

బాల్యాన్ని గుర్తు చేసుకొన్న విజయ్
తన చిన్ననాటి స్నేహితుడు మనోహర్‌ను విజయ్ ఈ సందర్బంగా గుర్తు చేసుకొన్నాడు. తను కవితలు బాగా రాస్తాడు. తెల్లగా ఉంటాడు అని విజయ్ అన్నాడు. సత్యసాయి పాఠశాలలో చదువుకోవడం వల్లే నేను మానసికంగా స్ట్రాంగ్‌గా ఉన్నాను అని విజయ్ దేవరకొండ చెప్పాడు.


Click it and Unblock the Notifications











