రికార్డులు తిరగరాస్తున్న విజయ్ దేవరకొండ.. హిందీలో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా.!

By Manoj

తెలుగులో చేసిన తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ పేరును ప్రథమంగా చెప్పుకోవచ్చు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ కుర్రాడు.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో పక్కింటి అబ్బాయిలా కనిపించిన విజయ్.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం తనలోని బోల్డ్ యాంగిల్ చూపించాడు. దీంతో యూత్‌లో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన అతడి పాపులారిటీ.. ఈ మధ్య బాలీవుడ్‌కూ పాకింది. అక్కడ మనోడు ఎంతలా ప్రభావం చూపిస్తున్నాడో అనడానికి ఓ రికార్డు ఉదాహరణ అయింది. ఇంతకీ ఏంటా రికార్డు.? వివరాల్లోకి వెళితే...

అనుకున్నదొకటి అయినది మరొకటి

అనుకున్నదొకటి అయినది మరొకటి

వరుస విజయాలతో దూకుడును ప్రదర్శించాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే గత ఏడాది ‘డియర్ కామ్రేడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాకు నష్టాలే మిగిలాయి. దీంతో రౌడీ ఫ్యాన్స్‌ నీరసించిపోయారు.

వాళ్లిద్దరూ మాత్రం కెరీర్ బెస్ట్ ఇచ్చారు

వాళ్లిద్దరూ మాత్రం కెరీర్ బెస్ట్ ఇచ్చారు

భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా వల్ల నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. అయితే, ఇందులో నటించిన విజయ్, రష్మిక మందన్నాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో వీళ్లిద్దరూ చేసిన పాత్రలు, చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ఈ జంట చేసిన యాక్టింగ్ వాళ్ల కెరీర్ బెస్ట్ అన్న అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి.

అక్కడ మాత్రం సూపర్ హిట్.. ఇక్కడ నిరాశే

అక్కడ మాత్రం సూపర్ హిట్.. ఇక్కడ నిరాశే

‘డియర్ కామ్రేడ్' డిజిటల్ మీడియా దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుదలైంది. అక్కడ మాత్రం ఈ మూవీ భారీ స్థాయిలో క్లిక్స్ రాబట్టింది. ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టడంలో విఫలమైన ఈ మూవీ.. ఆన్‌లైన్‌లో మాత్రం ఆకర్షించగలిగింది. మరోవైపు, టెలివిజన్ ప్రీమియర్‌గా వచ్చినప్పుడు మాత్రం సాదాసీదాగా టీఆర్పీ రేటింగ్ సాధించి నిరాశనే మిగుల్చుకుంది.

రికార్డులు తిరగరాస్తున్న విజయ్ దేవరకొండ

రికార్డులు తిరగరాస్తున్న విజయ్ దేవరకొండ

థియేటర్లలో ఫ్లాప్, అమెజాన్‌లో హిట్, టెలివిజన్‌లో తక్కువ రేటింగ్.. ఇలా మారుతూ వచ్చింది ‘డియర్ కామ్రేడ్' రిజల్ట్. అయితే, గత నెలలో హిందీలోకి డబ్ అయిన ఈ సినిమాను యూట్యూబ్‌లో ఉంచితే మాత్రం భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో పలు రికార్డులు బద్దలయ్యాయి.

హిందీలో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా.!

హిందీలో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా.!

తాజాగా ఈ సినిమా ఓ మైలురాయిని చేరుకుంది. ఫలితంగా విజయ్ దేవరకొండ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ సినిమా యూట్యూబ్‌లోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే 62 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాదు, 1 మిలియన్ లైక్స్ కూడా అందుకుంది. ఇంత తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ సాధించిన ఏకైక హీరోగా విజయ్ రికార్డులకెక్కాడు.

డైరెక్టుగా హిందీ వాళ్లనే టార్గెట్ చేసేశాడు

డైరెక్టుగా హిందీ వాళ్లనే టార్గెట్ చేసేశాడు


ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ప్రేమికుల రోజున విడుదల కానుంది. దీనితో పాటు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్' అనే మూవీలోనూ చేస్తున్నాడు. ఇది తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందుతోంది. దీనికి పూరీ, ఛార్మీతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X