Vijay Deverakonda రికార్డు ధరకు లైగర్ సినిమా ఓటీటీ రైట్స్.. మైక్ టైసన్ కోసం బాలకృష్ణ, అమితాబ్!
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యువ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రం విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకొంటున్నది. ఇటీవల యూనిట్ రిలీజ్ చేసిన సినిమా వీడియోకు భారీ స్పందన లభించింది. దాదాపు 20 మిలియన్ల వ్యూస్ సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు పెట్టుకొన్న అంచనాలు ఏమిటో స్పష్టమైంది. బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు రోజుకు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. లైగర్‌కు సంబంధించిన తాజా విషయాల్లోకి వెళితే..

మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో
బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కతున్న లైగర్ చిత్రంలో ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ను ప్రత్యేక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మధ్య సన్నివేశాలను గత కొద్ది రోజుల క్రితం అమెరికాలో షూట్ చేసి వచ్చారు. మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించడం లైగర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

మైక్ టైసన్‌కు బాలయ్య డబ్బింగ్
అయితే లైగర్ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. మైక్ టైసన్‌కు సంబంధించిన పాత్రకు తెలుగులో నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ చెప్పనున్నట్టు తెలిసింది. దాంతో ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఒకవేళ బాలకృష్ణ డబ్బింగ్ చెబితే లైగర్ సినిమాకు మరో ప్రత్యేకత అవుతుంది.

హిందీలో అమితాబ్ బచ్చన్
లైగర్ హిందీ వెర్షన్‌కు సంబంధించి అమితాబ్ బచ్చన్‌ను రంగంలోకి దించారు. మైక్ టైసన్ పాత్రకు హిందీలో బిగ్‌బీ డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. దీంతో హిందీ వెర్షన్‌కు మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండటం గమనార్హం.

హాట్ కేకుల్లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్
ఇలా లైగర్ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరగడంతో భారీ బిజినెస్ కూడా జరుగుతున్నది. లైగర్‌కు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను డీస్నీ+హాట్ స్టార్, శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకొన్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేట్ చెల్లించి స్టార్ మా సొంతం చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

డిస్నీ+హాట్ స్టార్‌కు ఓటీటీ రైట్స్
లైగర్ సినిమాకు సంబంధించి డిజిటల్ లేదా ఓటీటీ రైట్స్ అమ్మకం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను సుమారు 65 కోట్ల రూపాయలకు డీస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. ఈ మొత్తం విజయ్ దేవరకొండ సినిమా కెరీర్‌లోనే హయ్యెస్ట్ కావడం విశేషంగా మారింది.

ఆగస్టు 25న రిలీజ్‌కు సిద్ధం
భారీ అంచనాలను పెంచుకొంటున్న లైగర్ చిత్రం ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇలా ఉన్నాయి.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, ఆలీ, విషురెడ్డి, మక్రంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను, అబ్దుల్ ఖాదీర్అమీన్, మైక్ టైసన్ తదితరులు
రచన, డైరెక్టర్: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: కరణ్ జోహర్, చార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరూ యష్ జోహర్, పూరీ జగన్నాథ్
డీవోపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: అండీ లాంగ్
డిస్ట్రిబ్యూషన్: యష్ రాజ్ ఫిలింస్
రిలీజ్ డేట్: 2022-08-25


Click it and Unblock the Notifications











