తమిళ స్టార్ హీరోతో విజయ్ దేవరకొండ భారీ మల్టీస్టారర్!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు 2020 వరకు తీరిక లేకుండా సినిమాలు ఉన్నాయని తెలిపాడు. అది నిజమే అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల సూపర్ సక్సెస్ తరువాత విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది.
ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పినట్లు వార్తలు వస్తుంది. అది కూడా భారీ మల్టీస్టారర్ చిత్రం అని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య, విజయ్ కలసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సూర్యకు తెలుగులో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది. విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన నోటా చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని అంతా చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











