అదరగొట్టిన 'అర్జున్ రెడ్డి'.. అలా కనిపించడంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అనతికాలంలోనే అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. తనదైన లుక్, మాటలతో ప్రేక్షకులను కట్టి పడేయడంలో సక్సెస్ అయ్యాడు. లేటెస్ట్ ట్రేండ్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆడియన్స్‌ని అలరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా సినిమాకు విజయ్ లుక్‌లో మార్పు కనిపిస్తూ వస్తోంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన విజయ్‌ని చూసి షాక్ అయ్యారు జనం. అందుకు కారణం అతని లుక్ మాత్రమే.

ప్రస్తుతం ఆయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో విజయ్ లుక్ చాలా రఫ్‌గా, పూర్తి గడ్డంతో కనిపించింది. కానీ ప్రస్తుతం దానికి పూర్తి భిన్నంగా క్లీన్ షేవ్ లో కనిపించాడు ఈ రౌడీ స్టార్. గుండ్రటి అద్దాలు ధరించి వెరైటీగా దర్శనమిచ్చాడు. దీంతో ఈ లుక్ నెట్టింట వైరల్ అయింది.

Vijay Deverakondas New Look Viral On Social Media

మొదట పెళ్లి చూపులు సినిమాలో డీసెంట్ లుక్‌లో దర్శనమిచ్చి క్లాస్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా తన మాస్ టాలెంట్ బయటపెట్టాడు. ఆ వెంటనే 'గీతగోవిందం' రూపంలో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకర్షించాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవలే 'డియర్ కామ్రేడ్' అంటూ కాస్త డీలా పడ్డాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ పట్టేయాలని ఫిక్స్ అయిన విజయ్.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ పూర్తికాగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉంది. చిత్రానికి 'ఫైటర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి 'ఫైటర్' లో లుక్ ఎలా ఉంటుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X