twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్నేహితుడి కోసం రంగంలోకి దిగిన కొరటాల..దేవరకొండతో వర్కౌట్ చేయబోతే తేడా కొట్టిందే!

    |

    సినిమా రంగంలో స్థిర పడ్డాక చాలా మంది తమ స్నేహితులకు అండగా నిలబడుతూ ఉంటారు. అలా తాను దర్శకుడు అయ్యాక తన స్నేహితుడిని నిర్మాతగా చేశారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. ఆ నిర్మాత మరెవరో కాదు యువ సుధా ఆర్ట్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్. ప్రస్తుతానికి ఆయన టాలీవుడ్ లో చాలా సినిమాలు నిర్మిస్తున్నారు. కొరటాల శివ అండ ఉండటంతో మంచి కాంబినేషన్ సెట్ చేసుకుంటూ ఆయన నిర్మాణంలో పట్టు పెంచుకుంటున్నారు.

    అయితే ప్రస్తుతం తన క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయించాలని భావించిన ఆయన తన స్నేహితుడు కొరటాల శివ ని రంగంలోకి దించారు. అయితే కొరటాల శివ రంగంలోకి దిగి సినిమా చేయమని అడిగినా విజయ్ కాదు అన్నాడట.. ఆ వివరాల్లోకి వెళితే..

    లైగర్ తో బిజీ

    లైగర్ తో బిజీ

    ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. లైగర్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరి కనెక్ట్ బ్యానర్ మీద చార్మి,పూరి జగన్నాథ్ లు కరణ్ జోహార్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ ఆపేయాల్సిన పరిస్థితి.

    ఇప్పటికే మరో రెండు సినిమాలు లైన్ లో

    ఇప్పటికే మరో రెండు సినిమాలు లైన్ లో

    అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా విజయ్ దేవరకొండ చేయాల్సి ఉంది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా కొరటాల శివ విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు తెలుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సిందిగా కొరటాల శివ విజయ్ దేవరకొండను కోరినట్లు సమాచారం.

    ఇబ్బంది లేదు కానీ చేయలేను

    ఇబ్బంది లేదు కానీ చేయలేను

    మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని భావిస్తున్నారు. ఆ సినిమాలో హీరో కోసమే ప్రస్తుతానికి వేటలో పడ్డారు. అందులో భాగంగానే కొరటాల శివ విజయ్ దేవరకొండ తో మీటింగ్ ఏర్పాటు చేశారట. విజయ్ దేవరకొండ వెంకీ కుడుముల కొరటాల శివ ముగ్గురు భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని కానీ ఇప్పటికే రెండు సినిమాలు ఉన్న కారణంగా మరో సినిమాకి ఇప్పుడే కమిట్మెంట్ ఇవ్వలేను అని విజయ్ దేవరకొండ చెప్పినట్లు సమాచారం..

    మరో హీరో కోసం

    మరో హీరో కోసం

    విజయ్ దేవరకొండ చెప్పిన రీజన్ కూడా విన్న కొరటాల శివ విజయ్ తో ఏకీభవించి నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతానికి సినిమాలు బాగా లేట్ గా తెరకెక్కుతున్న కారణంగా విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాల తర్వాత ఈ సినిమాకి డేట్స్ ఇస్తే అప్పటి దాకా వెంకీ కుడుములను ఖాళీగా ఉంచడం కూడా కష్టమేనని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో హీరోను వెతికేందుకు కొరటాల శివ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ చివరికి ఎవరికి ఫైనల్ అవుతుందో ?

    English summary
    Star director Koratala Siva shares a close rapport with Sudhakar Mikkilineni who runs and operates Yuvasudha Arts. so koratala is looking to set up new projects for Yuvasudha Arts banner. He even signed budding director Venky Kudumula to work under Yuvasudha Arts production. Recently, Koratala Siva tried to arrange a meeting between Venky and Vijay Deverakonda for a potential collaboration. But vijay denied to make movie with venky kudumula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X