ఆ సినిమా బాలేదన్న చిన్నపాప.. నచ్చిన నటుడు అతనే.. విజయ్ దేవరకొండ అదిరిపోయే ఆన్సర్
విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్‌లో ఓ బ్రాండ్. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. అంతకంతకూ క్రేజ్‌ను పెంచుకుంటోన్న హీరో. సక్సెస్‌లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. కానీ యాటిట్యూడ్ ఎప్పటికీ ఉంటుంది. విజయ్‌లో ఉన్న ఆ యాటిట్యూడ్, మిగతా హీరోలతో ప్రత్యేకంగా ఉండేలా చేస్తోంది. ఆ స్పెషాలిటినే యూత్‌కు తెగ నచ్చేసింది. అందుకే సినిమా హిట్ అయినా ఫట్ అయినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

ఆ వేడుకలో విజయ్..
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాకు యువ హీరో విజయ్ దేవరకొండ హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాల గురించి చెప్పుకొచ్చాడు. సినిమాల పరాజయం, కొత్తలో వచ్చినప్పుడు ఉన్న ఆలోచనలు, ప్రస్తుతం అతను ఎదుర్కొంటోన్న పరిస్థితుల గురించి చక్కగా మాట్లాడాడు.

ఫలితాల గురించి పట్టించుకోను
సినిమా ఫలితం ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తాను సినిమాల జయాపజయాలను పట్టించకోనని తెలిపాడు. అయితే సినిమా నిరాశపరిచినప్పుడు తరువాతి చిత్రంతో ఎలాగైనా మెప్పించాలనే పట్టుదల కలుగుతుందని అన్నాడు.

నిజమైన విమర్శను స్వీకరిస్తా..
సినిమాలు ఆడనప్పుడు.. ఎక్కడ పొరపాట్లు జరిగాయనే విషయంలో ఫ్రెండ్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని తెలిపాడు. ఈ మధ్య 'డియర్ కామ్రేడ్' చూసిన తర్వాత ఒక చిన్న పాప ఇచ్చిన రివ్యూ గురించి చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. కానీ సెకండ్ హాఫ్ ఏమాత్రం నచ్చలేదని చెప్పిందట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి నిజమైన విమర్శను స్వీకరిస్తానని అన్నాడు.

మొదట్లో అలా అనుకున్నా..
సినిమా అనేది వ్యాపారం. డబ్బు ఉంటుంది.. ప్రచారం ఉంటుంది.. పవర్ ఉంటుంది.. ఎన్నో జరుగుతూ ఉంటాయని అన్నాడు. తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా తనకు నచ్చింది చేస్తూ పోతానని అనుకున్నట్లు... కానీ కొంత సమయం గడిచిన తర్వాత ఇక్కడ ఉండాలంటే సక్సెస్ ఉండాల్సిందేననే విషయం అర్థమైందంటూ చెప్పుకొచ్చాడు.
Recommended Video

నచ్చిన నటుడు అతనే..
ఫేవరేట్ కోస్టార్ ఎవరంటూ విజయ్‌ను ఇరుకున పెట్టే ప్రశ్నను అడిగిన వ్యక్తికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. తనకు ఇష్టమైన నటుడు వెన్నెల కిషోర్ అంటూ చెప్పిన సమాధానానికి అక్కడి వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియోను వెన్నెల కిషోర్ లైక్ చేయడంతో మరింత వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











