For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డేటింగ్ చేయను.. రొమాన్స్ పెద్దగా ఇష్టముండదు.. Most Desirable Man 2019 విజయ్ దేవరకొండ

  |

  టాలీవుడ్‌లో స్టైలిష్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ జీవితంలో మరో అరుదైన ఘనత చోటుచేసుకొన్నది. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2019గా ఎంపికయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ప్రభాస్, మహేష్ లాంటి వారిని వెనకకు నెట్టి విజయ్ దేవరకొండకు నెటిజన్లు పట్టం కట్టారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

   మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ 2019గా

  మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ 2019గా

  హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ 2019గా విజయ్ దేవరకొండ ఎంపిక కావడం ఇది రెండోసారి. గతంలో మహేష్ బాబు తప్ప మరో హీరో ఈ ఫీట్‌ను సాధించలేదు. అయితే వచ్చే ఏడాది కూడా తాను మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020గా ఎంపిక అవుతానని విజయ్ దేవరకొండ కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశారు. ఇందులో సీక్రేట్ ఏమీ లేదు. ప్రేక్షకులు నా మీద ఎందుకు అంత ప్రేమను కురిపిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది అని విజయ్ దేవరకొండ అన్నారు.

   వరుసగా రెండోసారి

  వరుసగా రెండోసారి

  వరుసగా రెండోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2019గా పట్టం కట్టడంపై చాలా ఆనందంగా ఉంది. నాపై ప్రజలకు ఇంత ప్రేమ ఉందనే విషయం నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇదంతా భగవంతుడి ప్రేమ వల్లనే సాధ్యమైంది. నాకు ఏదనిపిస్తే అది చేయడం, నాకు ఇష్టవచ్చినట్టు ఉండటమే నేను చేస్తాను. అదే విషయం ప్రజలకు దగ్గరగా చేసిందని భావిస్తాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

   అమ్మాయిలను మాటలతో కవ్వించను

  అమ్మాయిలను మాటలతో కవ్వించను

  నేను నటించిన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల్లో మాదిరిగా అమ్మాయిలను మాటలతో గానీ, చేతలతో గానీ ఆకర్షించను. ఎదుటి వ్యక్తిని బట్టి నా అప్రోచ్ ఉంటుంది. ఎక్కడ కలిశాం.. కలువడానికి పరిస్థితులు ఏమిటనే అంశాలు రిలేషన్‌ను ప్రభావితం చేస్తాయి. అమ్మాయిల్లో నేను ఎక్కువగా ఫ్రెండ్‌షిప్‌ను కోరుకొంటాను. నేను ఈ అమ్మాయితో ఎక్కువ సేపు కలిసి ఉండాలనే కోరిక కలగాలి. అమ్మాయిలో నవ్వును ఇష్టపడుతాను. ఆమెతో కలిసి నవ్వును పంచుకోవాలని చూస్తా. నేను ఇష్టపడే అమ్మాయి స్టార్ట్‌గా, అందంగా ఉండాలి అని విజయ్ దేవరకొండ చెప్పారు.

  డేటింగ్, రొమాంటిక్ లైఫ్‌పై

  డేటింగ్, రొమాంటిక్ లైఫ్‌పై

  నేను ఎక్కువగా డేటింగ్ చేయను. నాకు పెద్దగా రొమాన్స్ అంటే ఇష్టం ఉండదు. నా అభిరుచులకు తగినట్టుగా నాకు సరైన వ్యక్తి దొరికితే.. అదే ఫర్‌ఫెక్ట్ డేటింగ్. నా ఇంట్లో బెడ్‌రూంలో గడపడం గానీ, థియేటర్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం, లేదా ఫ్లయిట్‌లో ప్రయాణించడం లాంటి ఏవైనా నాకు ఫర్‌ఫెక్ట్ డేటింగ్ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

  Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
  ఫ్యామిలీ మ్యాన్‌ అవుతాను

  ఫ్యామిలీ మ్యాన్‌ అవుతాను

  ప్రస్తుతం బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తాను. సమయం వచ్చినప్పుడు నేను ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోతాను. జీవితంలో అన్ని రకాల ఫేజ్‌లు ఉండాలని కోరుకొంటాను. నా కుటుంబ సభ్యులు కోరికలను తీర్చాలనే ఉద్దేశం ఉంది. నీకంటూ ఫ్యామిలీ, పిల్లలు ఉండటం అనేది జీవితంలో గొప్ప విషయంగా భావిస్తాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

  English summary
  Crazy Star Vijay Deverakonda as Hyderabad Times Most Desirable Man 2019 in Second time in a row. On this occassion, Vijay said, He doest like dating, romance much.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X